Tollywood : టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్ళీ తోడతారా…?
తెలంగాణా లో డ్రగ్స్ కేసుకి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థలు చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నాయి. పూర్తి వివరాలు, ఆధారాలకోసం ఈడీ ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు లేఖ రాసినా సరే సరైన స్పందన రావడం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి ఈడీ అధికారులు హైకోర్ట్ లో పిటీషన్ వేయగా… హైకోర్ట్ కూడా ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి కీలక ఆధారాలను ఈడీ కి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
2017 లో టాలీవుడ్ స్టార్స్ తో పాటు మొత్తం 41 మంది కాల్ డేటా రికార్డింగ్స్ ను ఎక్సైజ్ శాఖ నమోదు చేసింది. వీరిపై 2017 లో 12 ఎఫ్ ఐ ఆర్లు నమోదు చేసారు. డ్రగ్స్ నిందితుల తో పాటు సాక్షుల నుండి కాల్ డేటా రికార్డింగ్స్ తీసుకున్నామని ఈడి కి ఎక్సైజ్ సుపరిడెంట్ శ్రీనివాస్ తెలిపారు. విచారణ సందర్భంగా అందరి కాల్ డేటా రికార్డింగ్స్ చేసింది.
నిందితుడు కెల్విన్ మొబైల్ ఫోన్ ను సైతం అధికారులు అప్పట్లో సీజ్ చేసారు. డ్రగ్స్ ఫెడ్లర్ కెల్విన్ తో స్టార్స్ కు ఉన్న సంబంధాల ఆధారాల కోసం స్టార్స్ కాల్ డేటా రికార్డింగ్స్ బయటికి తీసింది. అయితే వీటిని ఈడీ అధికారులకు మాత్రం ఇవ్వలేదు. ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ ల తో పాటు,ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన ఒరిజినల్ మెటీరియల్ ను ఇవ్వాలని అధికారులు కోరారు.