Intinti Gruhalakshmi : తులసి దీక్ష ఫలిస్తుందా? ఎస్ఐ అభిని చూపిస్తాడా? లేక అభిని ఎన్ కౌంటర్ చేసేందుకు ప్లాన్ చేశాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi : తులసి దీక్ష ఫలిస్తుందా? ఎస్ఐ అభిని చూపిస్తాడా? లేక అభిని ఎన్ కౌంటర్ చేసేందుకు ప్లాన్ చేశాడా?

 Authored By gatla | The Telugu News | Updated on :27 February 2022,9:32 am

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 28 ఫిబ్రవరి 2022, ఎపిసోడ్ 567 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకిత ఫోన్ చేయడంతో తాను పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నానని చెప్పకుండా తనకు రావడం లేట్ అవుతుందని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తులసి. మరోవైపు మీ అమ్మ అక్కడ నీకోసం దీక్ష చేస్తోంది అంటూ అభికి చెబుతాడు ఎస్ఐ. అంటే నీకు మూడింది అన్నమాట అంటాడు అభి. దీంతో ఇప్పుడే నీ అమ్మ దీక్ష చేస్తున్న స్థలాన్ని ఖాళీ చేయిస్తా.. అని చెప్పి వెంటనే కానిస్టేబుల్ కు ఫోన్ చేసి వెంటనే తులసి టెంట్ పీకి పారేయండి. తనను అక్కడి నుంచి తరిమి కొట్టండి అని చెబుతాడు. దీంతో పోలీసులు తన టెంట్ దగ్గరికి వెళ్తారు. కానీ.. అప్పటికే తను అక్కడ కూర్చొని ఉంటుంది. దీంతో తనను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెబుతారు పోలీసులు.

will tulasi able to find out abhi after her protest against police

will tulasi able to find out abhi after her protest against police

అయినా కూడా తులసి వినదు. నాకొడుకును చూపించందే నేను ఇక్కడి నుంచి కదలను అని అంటుంది తులసి. దీంతో పోలీసులు దీక్ష మానుకొని ఇంటికి వెళ్లిపోండి అంటారు పోలీసులు. దౌర్జన్యంగా టెంట్ పీకి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాల్సి వస్తుంది అంటారు పోలీసులు. అయినా సరే.. నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్లను అంటుంది తులసి. దీంతో తన టెంట్ పీకేందుకు పోలీసులు ముందడుగు వేస్తారు. అప్పటికే మీడియా తన దగ్గరికి వస్తుంది. మీడియా వాళ్లు రావడం చూసి పోలీసులు వెనకడుగు వేస్తారు. ఇదే విషయాన్ని కానిస్టేబుల్.. ఎస్ఐకి ఫోన్ చేసి చెబుతాడు. దీంతో ఎస్ఐకి తీవ్రంగా కోపం వస్తుంది.

మరోవైపు తులసి ఇంకా ఇంటికి రాలేదని ఇంట్లో వాళ్లు అందరూ టెన్షన్ పడుతూ  ఉంటారు. నందుకు తెగ కోపం వస్తుంది. ఎప్పుడు ఫోన్ చేసినా ఆంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది అంటుంది అంకిత. తులసి కూడా ఎందుకు ఇలా చేస్తోంది అని అందరూ అనుకుంటారు. బాధ్యత లేకపోవడం అంటే ఇదే అని నందు అంటాడు.

తనకు ఏమైనా అయితే ఎవరిని అంటారు. మగాడివి.. ఇంట్లో ఉండి చూసుకోలేవా.. అని నన్నే అంటారు అంటాడు నందు. అభిని వెతుక్కున్నట్టే.. రేపు తులసిని కూడా వెతుక్కోవాలా అంటుంది లాస్య. తులసి గురించి అనే హక్కు నీకు లేదురా.. అభి విషయంలో నువ్వు ఏమైనా సాయం చేశావా అంటుంది అనసూయ.

Intinti Gruhalakshmi : తులసిని మరో ఆఫర్ ఇచ్చిన ఎస్ఐ.. అయినా తిరస్కరించి దీక్షను కంటిన్యూ చేసిన తులసి

కట్ చేస్తే ఉదయం కాగానే ఎస్ఐ పోలీస్ స్టేషన్ కు వస్తాడు. తులసి దగ్గరికి వచ్చి తనను మళ్లీ బెదిరిస్తాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు కానీ.. తులసి వినదు. మీరు స్టేషన్ కు వెళ్లకుండా.. డైరెక్ట్ గా నాదగ్గరికి వస్తున్నారు ఏంటి అని ప్రశ్నిస్తుంది తులసి.

కంగారు మొదలైందా. ఏ భయమైనా ముందు కంగారుతోనే మొదలవుతుంది. మీ విషయంలో అదే జరుగుతోంది సార్. రాత్రి బెదిరించి వెళ్లారు. ఇప్పుడు కంగారుగా వచ్చారు. మీరు నా టెంట్ తీసేయించలేకపోయారు అంటే.. గెలపు నావైపే ఉంది అని అనిపిస్తోంది.

చివరి సారిగా చెబుతున్నాను. నా ఆఫర్ కు ఒప్పుకోండి అని అంటుంది తులసి. దీంతో అభిని కొడుతున్న ఓ ఆడియోను వినిపిస్తాడు పోలీస్. ఇప్పుడు చెప్పు ఎవరు.. ఎవరి ఆఫర్ కు ఒప్పుకోవాలో అంటాడు ఎస్ఐ. దీంతో తులసి అభి ఏడుపు విని వెక్కి వెక్కి ఏడుస్తుంది.

నేను ఇప్పటి వరకు ఇగోయిస్ట్ నే. రెచ్చగొట్టి శాడిస్ట్ గా మారుస్తున్నావు అంటాడు పోలీస్. నీ కొడుకు క్షేమంగా ఉండాలంటే వెనక్కి తగ్గు అంటాడు పోలీస్. నా కొడుకు ఏడుపు వినగానే కలవరపడ్డాను కానీ.. భయపడలేదు.. అంటుంది తులసి.

మరోవైపు టీవీలో తులసి దీక్ష చేయడాన్ని చూస్తుంది గాయత్రి. వెంటనే లాస్యకు ఫోన్ చేస్తుంది. దీంతో తులసి దీక్ష చేసే విషయం కూడా తమకు తెలియదు అంటుంది లాస్య. మాకు ఎవ్వరినీ ఈ న్యూస్ తెలియదు. తులసి కూడా మాకు చెప్పలేదు అంటుంది లాస్య.

దీంతో సరే.. డైరెక్ట్ గా తులసి దగ్గరికే వెళ్లి తేల్చుకుంటా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది గాయత్రి. మరోవైపు అభిని అడవికి తీసుకెళ్లి.. వదిలేస్తాడు ఎస్ఐ. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతాడు అభి. దీంతో క్షమించేశాను వెళ్లిపో అంటాడు ఎస్ఐ. దీంతో అభి పరిగెత్తుతాడు. అప్పుడే తన గన్ తీసి అభికి గురి పెట్ట కాల్చుతాడు ఎస్ఐ. ఇంతలోనే తులసి కూడా అక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది