YSRCP : వైసీపీ నేతల బరితెగింపు.. అధికార పార్టీ అయినంత మాత్రాన.. ఇంతలా రెచ్చిపోతారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSRCP : వైసీపీ నేతల బరితెగింపు.. అధికార పార్టీ అయినంత మాత్రాన.. ఇంతలా రెచ్చిపోతారా?

 Authored By sukanya | The Telugu News | Updated on :7 September 2021,4:40 pm

YSRCP ఏపీలో వైసీపీ నేతల బెదిరింపుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవల కాలంలో వైసీపీ నేతల ఆడియోలు, వీడియోలు వైరల్ గా మారుతున్న తీరు షాక్ కు గురి చేస్తోంది. తాజాగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు జయరామిరెడ్డి ఓ కాంట్రాక్టర్ ని బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. కనేకల్ నుండి నల్లంపల్లి వరకు చేపట్టిన రోడ్డు పనులను ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలా మొదలు పెడతారని, ఎమ్మెల్యే ను కలిసిన తర్వాతనే పనులు చేయాలని బెదిరింపులకు దిగినట్లుగా ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది. ఇక ఈ ఘటన ఏపీ రాజకీయ వర్గాల్లో దుమారం రేపగా, తాజాగా మరో ఉదంతం ఏపీ రాజకీయ వర్గాలను ఆలోచించేలా చేస్తోంది. ఏపీలో ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోందని, ఇసుక అక్రమ రవాణా వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని చాలా కాలం నుండి తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

Ysrcp

Ysrcp

జగన్ పార్టీ నేతలే మాఫియాగా మారి దందాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక తాజాగా ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ఎస్ఐ ని మంత్రి జయరాం బెదిరింపు సంభాషణ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎస్సైతో సంభాషించారు. ఖాళీ ఇసుక ట్రాక్టర్ లను పట్టుకున్నారని, నలభై మంది తన దగ్గరకు వచ్చారని ఎస్సైతో మాట్లాడిన మంత్రి జయరాం పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేయాలని ఎస్ఐ హుకుం జారీ చేశారు.

బెదిరింపుల్లో నేతలు  YSRCP

అయితే ఎస్ఐ ఇసుక అక్రమ తవ్వకాలు చెయ్యొద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వుకోవాలని సూచించారు. ఇల్లీగల్ గా ఇసుక రవాణా చేయొద్దని, లీగల్ గా ఇసుక తీసుకెళ్లడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని వారికి చెప్పినట్లుగా ఎస్ఐ పేర్కొన్నారు. ఎస్సై చెబుతున్న విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి జయరాం ఉన్న ఇసుక ట్రాక్టర్లను తక్షణం వదిలేయాలని, లేనిపక్షంలో అధికారంలో ఉన్నప్పటికీ ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. తనకు మంత్రి పదవి ఎక్కువేం కాదని, తనకు తన ప్రజలు కావాలని పేర్కొన్న మంత్రి, మరోసారి పోటీ చేసేది కూడా తానేనంటూ వ్యాఖ్యానించారు.

ys jagan

ys jagan

తాను గెలిస్తేనే అక్కడ వ్యవహారం నడుస్తోందని పేర్కొన్న మంత్రి జయరామ్ ఇసుక ట్రాక్టర్లను వదిలేస్తారా లేదా ధర్నాకు దిగుతాను అంటూ ఎస్సైను బెదిరించిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేత జయరామిరెడ్డి ఉదంతం కూడా ఏపీలో హాట్ టాపిక్ అయింది. వైసీపీ నాయకుడు జయరామిరెడ్డి, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు. ఓ రోడ్డు కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యేకు తెలియకుండా పనులు చెయ్యకూడదని బెదిరింపులకు పాల్పడ్డారు.

రహదారి పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. పనులు ఆపకపోతే భౌతిక దాడులకు దిగుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ బెదిరింపు ఉదంతాలను అవకాశంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది