Nara Lokesh : జగన్ వెంటే జనం… అట్టర్ ఫ్లాప్ దిశగా లోకేష్ పాదయాత్ర.. ప్రూఫ్ వీడియో..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara Lokesh : జగన్ వెంటే జనం… అట్టర్ ఫ్లాప్ దిశగా లోకేష్ పాదయాత్ర.. ప్రూఫ్ వీడియో..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :16 February 2023,9:00 am

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఆశించిన స్థాయిలో ఏమాత్రం పార్టీకి మైలేజ్ తీసుకురావడం లేదని టాక్. ప్రారంభించిన రోజు మినహా తర్వాత పాదయాత్రలో ఎక్కడ కూడా జనాలు కనిపించడం లేదు. ప్రస్తుతం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. దీంతో లోకేష్ పాదయాత్రకి జనాలు రాని పరిస్థితి ఉన్న క్రమంలో.. పార్టీ ఇమేజ్ డామేజ్ కాకుండా మరో పక్క చంద్రబాబు మళ్ళీ “రాష్ట్రానికి ఇదేం కర్మ రా” బాబు అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేసారు. బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో

Nara Lokesh Padayatra utter flop

Nara Lokesh Padayatra utter flop

పర్యటించడానికి చంద్రబాబు రెడీ కావడం జరిగింది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా చంద్రబాబు మళ్ళీ ప్రజల్లోకి రావడానికి కారణం లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అని ఏపీ రాజకీయాల్లో టాక్. ఇదిలా ఉంటే లోకేష్ పాదయాత్రని ఎట్టి పరిస్థితులలో వైఎస్ జగన్ పాదయాత్రతో పోల్చటానికి ఏ పోలికలు లేవని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ పాదయాత్ర స్టార్ట్ చేసిన నాటినుండి జనం ఆయన వెంటే నడిచారు. మనస్ఫూర్తిగా తమ సమస్యలను జగన్ కి చెప్పుకునేవారు. కానీ లోకేష్ పాదయాత్రలో అంతా కూడా సినిమా సెట్టింగ్ తరహాలో…

Nara Lokesh Padayatra utter flop

Nara Lokesh Padayatra utter flop

పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో జనాన్ని మరియు ప్రస్తుతం లోకేష్ పాదయాత్రలో ఉన్న జనాన్ని కంపేర్ చేస్తూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ పట్టు ఉన్న జిల్లాలలో లోకేష్ పాదయాత్ర స్టార్ట్ అయితే అప్పుడు పరిస్థితులు మారే అవకాశం ఉందని మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ పాదయాత్రలో ఉన్న జనం… లోకేష్ పాదయాత్రలో అసలు ఎక్కడ కనిపించడం లేదని ఏపీ రాజకీయాల్లో టాక్ నడుస్తుంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది