Pawan Kalyan : అసంబ్లీ కి వెళతా ఎవడు ఆపుతాడో చూస్తా అన్న పవన్ కళ్యాణ్ కి కరక్ట్ ఆన్సర్ ఇదే !
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అయిన విషయం తెలుసు కదా. ఆయన ఇవాళ కత్తిపూడిలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారాహి విజయయాత్రలో భాగంగా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి ఎలాగైనా తాను అసెంబ్లీలో అడుగుపెడతా అని నొక్కిమరీ చెప్పారు. తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తా అంటూ చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో అడుగుపెట్టకూడదని నాపై కక్ష కట్టి 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో ఓడించారు. నాపై మీరు ఎంత కక్ష కట్టినా.. ఈసారి మాత్రం నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయలేరు. మీకు దమ్ముంటే ఈసారి నన్ను అడ్డుకోండి. సీఎం జగన్ మీకు దమ్ముంటే ఈసారి నేను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయండి.. అని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు.
నన్ను కనీసం గాజువాకలో అయినా గెలిపించి ఉంటే నేను రుషికొండను అయినా కాపాడేవాడిని. ఆంధ్రుల హక్కు అమరావతి అని.. అమరావతే రాజధానిగా ఉంటుందని పవన్ ఈసందర్భంగా స్పష్టం చేశారు. అసలు అమరావతిలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి. దానికి కారణం ఎవరు.. రాజధాని మార్పు పేరుతో మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న రచ్చ వల్లనే ఇదంతా. దీనికి ముమ్మాటికీ కారణం.. వైసీపీ ప్రభుత్వమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధానిపై కూడా కులముద్ర వేయడం దారుణమన్నారు.
Pawan Kalyan : మద్యపాన నిషేధం ఎక్కడ.. 25 వేల కోట్ల ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది?
ఎన్నికల ముందు వైసీపీ ఏమని చెప్పింది. మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక ఏం చేసింది. ఏపీలో ఎక్కడ చూసినా ఇప్పుడు మద్యం ఏరులై పారుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యంపై ఇప్పుడు ఏటా రూ.25 వేల కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. సీపీఎస్ రద్దు చేశామన్నారు. చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ.. మీరు చేతల్లో చేసిందేంటి. మా దగ్గర ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కానీ.. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ.. జనసేనను టార్గెట్ చేసింది. అంటే మేము అంటే ఎంత భయమె అర్థం అవుతూనే ఉంది అని పవన్ చెప్పుకొచ్చారు. వైసీపీకి సరైన గుణపాఠం చెప్పేది జనసేన మాత్రమే అని పవన్ బల్లగుద్ది మరీ స్పష్టం చేశారు.