Samsung Galaxy F23 5G : సామ్ సంగ్‌లో చవక ధరకు 5జీ ఫోన్.. ధర, ఫీచర్లు తెలిస్తే వావ్ అంటారంతే..
Samsung Galaxy F23 5G : సామ్‌సంగ్ బ్రాండ్ నుంచి మరో 5జీ ఫోన్ వచ్చేసింది. సరికొత్త ఫీచర్స్‌తో లాంచ్ చేయగా ఈ నెల 16 నుంచి సామ్‌సంగ్ ఎఫ్ 23 5జీ మొబైల్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఫ్లిప్ కార్ట్ స్టోర్ , సామ్‌సంగ్.కామ్ అలాగే మరికొన్ని సెలక్టెడ్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉండనుంది. సామ్‌సంగ్ నుంచి అతితక్కువ ధరలో 5జీ ఫోన్ భారత్‌లో లాంచ్ చేయడం జరిగింది. కాగా ఈ మొబైల్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు […]
Samsung Galaxy F23 5G : సామ్‌సంగ్ బ్రాండ్ నుంచి మరో 5జీ ఫోన్ వచ్చేసింది. సరికొత్త ఫీచర్స్‌తో లాంచ్ చేయగా ఈ నెల 16 నుంచి సామ్‌సంగ్ ఎఫ్ 23 5జీ మొబైల్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఫ్లిప్ కార్ట్ స్టోర్ , సామ్‌సంగ్.కామ్ అలాగే మరికొన్ని సెలక్టెడ్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉండనుంది. సామ్‌సంగ్ నుంచి అతితక్కువ ధరలో 5జీ ఫోన్ భారత్‌లో లాంచ్ చేయడం జరిగింది. కాగా ఈ మొబైల్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అందించనుంది. లాంచ్ ఆఫర్ తో కేవలం రూ. 15వేల లోపే పొందవచ్చు.
5000ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 5జీ ప్రాసెసర్, 120 హెర్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అలాగే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లాంటి స్పెసిఫికేషన్ ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది.కాల్స్ మాట్లాడేటప్పుడు ఇతర శబ్దాల డిస్టర్బ్ లేకుండా వాయిస్ ఫోకస్ ఆనే కొత్త ఫీచర్‌ను ఈ మొబైల్‌తో అందించనున్నారు. రెండు సంవత్సరాలు పాటు ఓఎస్ అప్‌డేట్‌లు, ఫోర్ ఇయర్స్ సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించనున్నారు.సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ మొబైల్ 4జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.18,499 ధరలలో లభించనున్నాయి.
Samsung Galaxy F23 5G : వాయిస్ ఫోకస్ కొత్త ఫీచర్
అయితే ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ.15,999కే అమ్మనున్నారు. అలాగే 6జీబీ వేరియంట్ ధర రూ.16,999 కే కొనుగొలు చేసుకోవచ్చు. అయితే ఈ మొబైల్‌ను ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొంటే మరో రూ.1000 అదనంగా డిస్కౌంట్ రానుంది. బ్యాంక్ ఆఫర్ కలుపుకొని ఈ ఫోన్ బేస్ మోడల్‌ను రూ.14,999కే కొనుగోలు చేసుకోవచ్చు. కాగా ఈ మొబైల్ ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో రానుంది. అలాగే డాల్బీ ఆట్మోస్ ఫీచర్ కూడా ఉంది.