రాజేంద్ర ప్రసాద్ కమర్షియల్ హీరో కాలేకపోవడానికి ఎన్.టి.ఆర్ కారణం ..?
రాజేంద్రప్రసాద్ .. సినిమా ఇండస్ట్రీకీ కామెడీ కింగ్. రాజేంద్ర ప్రసాద్ ని అందరూ రాజేంద్రుడు అంటారు. మెగాస్టార్ చిరంజీవి సహా అత్యంత సన్నిహితులు రాజా అని పిలుస్తారు. రాజేంద్ర ప్రసాద్ సినిమా హీరో అవ్వాలనుకున్నప్పుడు ఆయన జీవితంలో జరిగిన పెను మార్పు కి కారణం శ్రీ నందమూరి తారక రామారావు అన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇంకా చెప్పాలంటే ఈ సీక్రెట్ తెలిసిన వాళ్ళని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఎన్.టి.ఆర్ అంటే రాజేంద్ర ప్రసాద్ కి గౌరవం, భక్తి. ఆయన షూటింగ్స్ కి రాజేంద్రప్రసాద్ లంచ్ కారియర్ తీసుకు వెళ్ళేవాడు.
అక్కడ ఎన్.టి.ఆర్ ని రక రకాల వేశాలలో చూడటం.. ఎన్.టి.ఆర్ డైలాగ్స్ చెబుతుంటే చుట్టూ ఉన్నవాళ్ళు పొగడ్తలతో ముంచేయడం దగ్గరుండి చూశాడు రాజేంద్రప్రసాద్. అలా రాజేంద్ర ప్రసాద్ కి సినిమాలంటే ఆసక్తి కలిగింది. ఈ విషయాన్ని ఎన్.టి.ఆర్ కి చెబితే ఏమంటారో అని చాలా సందర్భాలలో చెప్పాలనుకొని ఆగిపోయారట రాజేంద్ర ప్రసాద్. కాని ఎన్.టి.ఆర్ ఆవళిస్తే పేగులు లెక్కపెట్టేస్తారు కదా. రాజేంద్ర ప్రసాద్ లో సినిమా పట్ల ఉన్న ఆసక్తిని ఇట్టే పసిగట్టారు. అందుకే సినిమాలలోకి వచ్చేయమని సలహా ఇచ్చారు.
అయితే కథ ఇక్కడే మొదలవలేదు. దేనికైనా ఒక అనుభవం కావాలి. అంటే రాజేంద్రప్రసాద్ కి నటనలో శిక్షణ కావాలి. అప్పుడే కెమెరా ముందు నటించగలడు. అదే చేశారు ఎన్.టి.ఆర్. చెన్నై లోని ప్రముఖ యాక్టింగ్ స్కూల్ లో ఎన్.టి.ఆర్ సిఫార్స్ తో చేరాడు రాజేంద్రప్రసాద్. అక్కడున్న వాళ్ళందరికంటే రాజేంద్రప్రసాద్ స్పీడ్ గా కోర్స్ పూర్తి చేశాడు. అంతేకాదు మైం యాక్టింగ్ లో రాజేంద్రప్రసాద్ ని ఎవరూ డామినేట్ చేయలేరు. అది ఆయన సినిమాలు చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది.
ఇక యాక్టింగ్ కోర్స్ పూర్తయ్యాక మొట్టమొదటిసారి ప్రముఖ దర్శకులు బాపు తెరకెక్కించిన స్నేహం అన్న సినిమాలో నటించాడు రాజేంద్ర ప్రసాద్. అంతేకాదు రాజేంద్ర ప్రసాద్ కి మంచి కమర్షియల్ హీరోగా పేరు సంపాదించుకోవాలని ఫిక్సైయ్యాడట. అయితే అప్పటికే ఎన్.టి.ఆర్, ఏ ఎన్ ఆర్ లాంటి కమర్షియల్ హీరోలుండటంతో ఎన్.టి.ఆర్.. రాజేంద్ర ప్రసాద్ కి ఒక సలహా ఇచ్చారు. అదే మీరు అందరూ చేసిది చేయకండి. ఏదైనా కొత్తగా ట్రై చేయండి అన్నారట. అంతేకాదు ఇప్పటి వరకు సినిమాలో కామెడి ఉంది కాని కామెడి సినిమానే అన్నది లేదు. మీరు పూర్తి స్థాయిలో కామెడీ హీరోగా మారితే అద్భుతమైన సక్సస్ ని చూస్తారు . మీకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలుంటాయి అని చెప్పారట.
అంతే ఆరోజు ఎన్.టి.ఆర్ ఇచ్చిన ఆ సలహాతో రాజేంద్రప్రసాద్ పూర్తి స్థాయిలో కామెడీ హీరో అయ్యారు. అప్పటి నుంచి ఎన్నో కామెడీ కథలు రాజేంద్రప్రసాద్ కోసమే పుట్టాయి. జంధ్యాల, రేలంగి నరసింహ రావు లాంటి వాళ్ళకి రాజేంద్రప్రసాద్ ఒక బ్రాండ్ అంబాజిడర్ గా దొరికారు. ఇక టాలీవుడ్ లో అప్పటి ఎన్.టి.ఆర్ నుంచి ఇప్పటి ఎన్.టి.ఆర్ వరకు ఎంతో మంది కమర్షియల్ హీరోలున్నారు గాని కామెడీ హీరో మాత్రం అప్పటికి ఇప్పటికీ ఒక్క రాజేంద్ర ప్రసాద్ మాత్రమే ఉండటం .. ఆ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేకపోవడం గొప్ప విషయం. ఇక రాజేంద్రప్రసాద్ కి డాక్టరేట్ బిరుదు తో పాటు నట కిరీటి అన్న బిరుదులు ఉన్నాయి.