EPFO : సుప్రీం కోర్ట్ కీలక ఆదేశం.. ఈపీఎఫ్ఓ లబ్ధిదారులకు అందే వరం ఏమిటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

EPFO : సుప్రీం కోర్ట్ కీలక ఆదేశం.. ఈపీఎఫ్ఓ లబ్ధిదారులకు అందే వరం ఏమిటి?

 Authored By mallesh | The Telugu News | Updated on :27 February 2022,10:00 am

EPFO : ప్రతి ఉద్యోగికి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ అన్నది చాలా ముఖ్యం. ముఖ్యంగా సంఘటిత కార్మికులకు ఈ ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ వల్ల ప్రతి ఉద్యోగి వారి జీవితాన్ని సంతోషంగా గడప వచ్చును. దీనిమీద ప్రభుత్వం చాలాసార్లు చర్చలు జరిపింది. ఇక ఇప్పుడు కీలక నిర్ణయాన్ని తీసుకోండి ప్రభుత్వం. ఈ ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ మీద సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకుందాం..ఈ పీఎఫ్ కు సంబంధించి సుప్రీం కోర్టు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దానికి సంబంధించిన ఆదేశాలను కూడా జారీ చేసింది సుప్రీం కోర్టు . మీలో ఎవరైనా సంఘటిత రంగంలో పనిచేస్తున్న, ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్.

ఉన్న వీరందరికీ సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశం వరమనే చెప్పాలి. ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ ఆలస్యం అవ్వడం వల్ల ఏర్పడే ఎలాంటి నష్టాలను అయినా సంబంధిత కంపెనీలే నష్టపరిహారాన్ని చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.ఈ విషయంలోనే కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించడం జరిగింది. సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ కు చెందిన సుమారు ఆరు కోట్ల మందికి పైగానే సబ్స్క్రైబర్లు లకు మేలు జరగనుంది. ఇక 20 లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేసే సంస్థల్లో కూడా ఉద్యోగులకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ అందనుంది.

supreme court key order the blessing given to epfo beneficiaries

supreme court key order the blessing given to epfo beneficiaries

EPFO : ఆరుకోట్ల మందికి మేలు..

అలాగే ఇతర నిబంధనల చట్టం సామాజిక భద్రతను కూడా అందజేస్తుందని జస్టిస్ అయినా జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా లతో కూడిన బెంచ్ ఈ విషయాన్ని తెలిపింది.అయితే ఎంప్లాయిలకు ప్రావిడెంట్ ఫండ్ క్రెడిట్ చేయడం ఆలస్యమైతే. ఈ చట్టం కింద ఉద్యోగుల పీఎఫ్ ను, డిటెక్ట్ చేసి తప్పనిసరిగా ఆ మొత్తాన్ని ఈపీఎఫ్ లో కంపెనీలు ఉద్యోగుల కు క్రెడిట్ రూపంలో అందజేయాలి. లేకపోతే ఈ చట్టానికి చెందిన సెక్షన్ 14 బి ప్రకారం పరిహారాలను చెల్లించాల్సి ఉంటుందని కర్ణాటక హైకోర్టు తీర్పును జారీచేసింది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు వారి ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ సరైన సమయంలో దక్కుతుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది