Beetroot Fry Recipe : బీట్రూట్ కూర పోషకాలు పోకుండా ఆరోగ్యంగా రుచిగా వండే తీరు…!
Beetroot Fry Recipe : ఈరోజు చేయబోయే రెసిపీ సింపుల్ బీట్రూట్ ఫ్రై బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ తీరులో చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు. అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి ఈ బీట్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని అందరికీ తెలుసు.. అయినా సరే చాలామంది బీట్రూట్ అంటే అసలు ఇష్టపడరు. అలాంటి వారికి ఈ విధంగా ట్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. దీనికి కావలసిన పదార్థాలు : బీట్రూట్, పచ్చిశనగపప్పు ఆవాలు ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి,
జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, కారం, ఉప్పు, పెసరపప్పు, శనగపప్పు పొడి, పచ్చి కొబ్బరి, మొదలైనవి…దీని తయారీ విధానం : ముందుగా బీట్రూట్ ని తీసుకొని శుభ్రంగా చెక్కు తీసి వాటిని సన్నటి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక్క కడాయి పెట్టి దానిలో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసి బాగా వేయించాలి. తర్వాత నాలుగైదు ఎండుమిర్చి కూడా తర్వాత దానిలో కొంచెం కరివేపాకు, కూడా బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి.
తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు పెసరపప్పు తర్వాత ఒక కప్పు నీటిని పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. కూర దగ్గరికి అయిన తర్వాత దాంట్లో పచ్చి కొబ్బరి పొడి పచ్చిశనగపప్పు పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపి దింపుకోవడమే. అంతే ఎంతో సింపుల్ గా బీట్రూట్ ఫ్రై రెడీ. బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.