Kebab Recipe : పెరుగుతో రెస్టారెంట్ కంటే బెస్ట్ వెజ్ కబాబ్ ఇంట్లోనే ఎంతో టేస్టీగా…!
Kebab Recipe : ఇవాల్టి స్పెషల్ వచ్చేసి రెస్టారెంట్ కంటే బెస్ట్ వెజ్ కాబాబ్, జబర్దస్త్ దహి కబాబు పెరుగుని వడకట్టుకుని మసాలాలు పన్నీరు కలిపి చేసేటటువంటి ఈ కబాబ్ అమేజింగ్ క్రియేషన్.. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంటారే అలాంటి కబాబ్ ఇది. బెస్ట్ అండ్ ఈజీ రెసిపీ ఇది. ఈ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : పెరుగు, చాట్ మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, పన్నీరు, నిమ్మకాయ, మిర్యాల పొడి, ఉప్పు, ప్రాసెస్ సీజ్ ,పుట్నాల పప్పు పొడి, ఆయిల్ మొదలైనవి…
దీని తయారీ విధానం : ముందుగా ఒక అర లీటర్ పెరుగుని తీసుకొని ఒక తెల్లని క్లాత్లో వేసి మూట కట్టి నైట్ అంతా ఫ్రిజ్లో ఉంచాలి. అలా ఉంచడం వలన నీరంతా పోయి పెరుగు గట్టిగా తయారవుతుంది. ఆ పెరుగుని ఒక బౌల్లో వేసి దానిలో కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొంచెం తురిమిన పన్నీరు అలాగే ఒక నిమ్మకాయ రసం, మిర్యాల పొడి కొంచెం మిరియాల పొడి, అరకప్పు ప్రాసెస్ డ్ చీజ్, పావు కప్పు పుట్నాల పప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి కబాబ్లా అన్నిటినీ తయారు చేసుకుని ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిజ్లో ఉంచి తర్వాత తీసుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక బాండీ పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ని వేసి ఆ ఆయిల్ హీటెక్కిన తర్వాత ఈ కబాబుల్ని దాన్లో వేసుకుని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఇంట్లోనే సులభంగా వెజ్ కబాబ్ రెడీ. దీనిని టమాటా సాస్ తో తీసుకోవచ్చు. ఇలాంటివి సాయంత్రం టైం లో పిల్లలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.