Brinjal Pakoda Recipe : ఇవే క్యాటరింగ్ వారి వంకాయ పకోడీ సీక్రెట్స్…!
Brinjal Pakoda Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్ వంకాయ పకోడీ. ఈ వంకాయ పకోడీని పెళ్లిళ్లకి, ఫంక్షన్స్ కి చేస్తూ ఉంటారు. ఈ రెసిపీ చేయడం చాలా సులభం. కానీ రెసిపీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ రెసిపీని కరెక్టు కొలతలతో చేయడం అలాగే రెసిపీని చూసి అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇలా చేస్తే కంపల్సరిగా చాలా టేస్టీగా, క్యాటరింగ్ స్టైల్లో వస్తాయి. ఈ క్యాటరింగ్ స్టైల్ వంకాయ పకోడీ ఎలా చేయాలో చూద్దాం; దీనికి కావాల్సిన పదార్థాలు : వంకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు ,జీలకర్ర, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, మైదా, కార్న్ ఫ్లోర్, పల్లీలు, జీడిపప్పులు, ఆయిల్, ఎల్లి పాయలు, పచ్చిమిర్చి కరివేపాకు, పచ్చి కొబ్బరి పొడి, కొత్తిమీర, ఆమ్చూర్ పౌడర్ మొదలైనవి…
దీని తయారీ విధానం : ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పునీళ్ళల్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పావు కప్పు ఉల్లిపాయలు వేసి దానిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని తర్వాత ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను దానిలో వేసి బాగా పట్టించాలి. తర్వాత ఒక కప్పు శెనగపిండి 1/4 కప్పు మైదాపిండి పావు కప్పు కార్న్ ఫ్లోర్ వేసి రెండు చెంచాలతో బాగా వంకాయ ముక్కలకి పట్టించుకోవాలి. తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత ఈ వంకాయ ముక్కలను దాన్లో వేసి మీడియం ఫ్లేమ్ లో బాగా ఎర్రగా వేయించుకోవాలి.
అలా వేయించుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే ఆ ఆయిల్ లో పల్లీలు, జీడిపప్పు ను వేసి వేయించుకుని తీసి వంకాయ ముక్కలలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఇంకొక కడాయి పెట్టి దానిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేయించి తర్వాత పకోడీని దానిలో వేసి కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇక చివరిగా కొద్దిగా కొత్తిమీర, కొంచెం పచ్చి కొబ్బరి పొడి, కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసి కలుపుకొని దింపుకోవడమే అంతే క్యాటరింగ్ వారి వంకాయ పకోడి రెడీ.