Coconut Junnu Recipe : ఐదు నిమిషాలలో కొబ్బరి జున్ను ఇది చూశాక పచ్చికొబ్బరి ఎప్పుడు వేస్ట్ చేయరు…!
Coconut Junnu Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి జున్ను. అతి సులువుగా కేవలం ఒక మూడు పదార్థాలతోనే ఇలా చాలా ఈజీగా చేసేయొచ్చు. దీనిని చూశాక పిల్లలు కూడా చిటకలో చేయగలరు. అంత ఈజీగా చేయడమే కాదు రుచి చూసాక మీరు ఎప్పటికీ కూడా మర్చిపోరు. అంత బాగా మీకు నచ్చుతుంది. ప్రాసెస్ అంతా ఈజీగా అవుతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి.. ఈ కొబ్బరి జున్ను ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : కొబ్బరి, కాన్ ఫ్లోర్, పంచదార, డ్రై ఫ్రూట్స్, మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని దాని నుండి కొబ్బరి తీసి కొబ్బరి పైనున్న బ్రౌన్ కలర్ ది తీసేసి
ఆ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా పట్టిన తర్వాత ఒక కప్పు కొబ్బరి అయితే రెండు కప్పుల నీళ్లను వేసి బాగా లూజుగా పట్టుకోవాలి. ఆ విధంగా పట్టుకున్న కొబ్బరిని తీసుకొని ఒక స్ట్రైనర్ తో దాని నుండి పాలు తీసి ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇక మిగిలిపోయిన కొబ్బరి మిశ్రమాన్ని పడేయకుండా బెల్లంతో లడ్డూల చుట్టుకోవచ్చు. ఇక ఆ కొబ్బరి పాల నుంచి కొన్ని పాలను తీసి దానిలో నాలుగు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకొని ఆ పాలను కూడా ముందు పోసుకున్న గిన్నెలో కూడా పోసుకొని బాగా కలిపి తర్వాత పావు కప్పు పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి.
ఇక తర్వాత స్టవ్ పై పెట్టి సీమ్లో పెట్టుకొని గరిటతో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతున్న టైంలో ఈ మిశ్రమం దగ్గరగా అవుతుంది. అలా దగ్గరగా అవుతూ ఉండగా.. స్టవ్ కట్టేసి మళ్లీ బాగా కలుపుకొని ఒక గాజు గిన్నెలోకి తీసుకొని దానిని బాగా చల్లారనిచ్చి తరువాత దాన్ని ఫ్రిజ్లో ఒక గంట పాటు పెట్టాలి. ఈ విధంగా గంట తర్వాత దానిని తీసి ఆ గిన్నెలో నుంచి రివర్స్లో ఒక ప్లేట్ లోకి వేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకొని ముక్కల కట్ చేసుకుని తీసుకోవచ్చు. అంతే ఎంతో సింపుల్ గా మూడే పదార్థాలతోనే కొబ్బరి జున్ను రెడీ అయిపోయింది. ఇది పిల్లలు ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది.