Coriander Rice Recipe : ఐదు నిమిషాల్లో కొత్తిమీర రైస్ చేసి లంచ్, డిన్నర్, లంచ్ బాక్స్ లోకి సూపర్ గా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Coriander Rice Recipe : ఐదు నిమిషాల్లో కొత్తిమీర రైస్ చేసి లంచ్, డిన్నర్, లంచ్ బాక్స్ లోకి సూపర్ గా…!

Coriander Rice Recipe : ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ మసాలా ఫ్లేవర్ తో అదిరిపోయే టేస్ట్ తో చాలా బాగుంటుంది. ఇలా మనం చాలా తక్కువ టైంలోనే టేస్టీగా లంచ్ లోకి ఐన ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే కాదు లంచ్ బాక్స్ లోకి కూడా చాలా ఫాస్ట్ గా ఇలా చేసి పెట్టొచ్చు. అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా హెల్తిగా టేస్టీగా కొత్తిమీర రైస్ చేసి ఆ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :18 October 2022,3:00 pm

Coriander Rice Recipe : ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ మసాలా ఫ్లేవర్ తో అదిరిపోయే టేస్ట్ తో చాలా బాగుంటుంది. ఇలా మనం చాలా తక్కువ టైంలోనే టేస్టీగా లంచ్ లోకి ఐన ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే కాదు లంచ్ బాక్స్ లోకి కూడా చాలా ఫాస్ట్ గా ఇలా చేసి పెట్టొచ్చు. అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా హెల్తిగా టేస్టీగా కొత్తిమీర రైస్ చేసి ఆ తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : రైస్, పచ్చి బఠానీ, క్యారెట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, అల్లం, ఎల్లిపాయలు, ఉప్పు, ఆయిల్, దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు,మొదలైనవి…

ముందుగా వేడి అన్నంతో చేస్తుంటే ముందే ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోండి. అండమనేది ముద్దలా కాకుండా పొడిపొడిగా రెడీ అవుతుంది. మీరు కావాలంటే ఈ కొత్తిమీర రైస్ ని మిగిలే అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకుందాం.. మీరు మరింత హెల్తీగా చేయాలంటే ఈ ఆయిల్ ప్లేస్ లో నెయ్యి నైనా తీసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక బిర్యాని ఆకుని అలాగే అర టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు పచ్చి బఠానీలను అలాగే పావు కప్పు క్యారెట్ ముక్కలను వేసుకుందాం.. అలాగే క్యారెట్ అవైలబుల్ లో లేకపోతే వీటిని వేయకుండా కూడా చేయొచ్చు. అలాగే ఇది త్వరగా ఫ్రై అవ్వడానికి టేస్టీగా రావడానికి కొంచెం ఉప్పుని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి కలిపాక మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి. తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ఒక పిడికెడు కొత్తిమీర, కొంచెం పుదీనా,అలాగే పొట్టు తీసిన ఆరేడు వెల్లుల్లిపాయల్ని చిన్న అల్లం ముక్కలు మూడు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం..

coriander rice recipe in telugu

coriander rice recipe in telugu

ఇందులోకి స్పైసెస్ వచ్చేసి చిన్న దాల్చిన చెక్క ,నాలుగు లవంగాలు, రెండు యాలకులను తీసుకుందాం.. కొత్తిమీర గ్రీన్ కలర్ అనేది మారకుండా ఉండడానికి మనం తీసుకున్న స్పైసెస్ గా ఉండడానికి కొంచెం అంటే ఒక అర టీ స్పూన్ వరకు పంచదార వేసుకోయాలి. ఇలా మనం కొంచెం పంచదార వేయడం వలన ఈ కొత్తిమీర రైస్ మంచి కలర్ ఫుల్ గా రెడీ అవ్వడమే కాదు.. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిని పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మరో పక్కన ఉడుకుతున్న బటాని క్యారెట్ మిశ్రమంలో ఈ కొత్తిమీర మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందే చల్లారబెట్టుకున్న రైస్ ని తీసుకొని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇక తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర, ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక రెండు నిమిషాలు తర్వాత మూత తీసి చూస్తే మంచి ఆరోమా వస్తుంది. ఇక స్టవ్ ఆపి ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుని రైతతో కానీ లేదా ఉత్తదే కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది