Crab Pickle Recipe : పీతల ఆవకాయ పచ్చడి ఇలా చేశారంటే .. రుచి ఎంత బాగుంటుందో ..!
Crab Pickle Recipe : ప్రస్తుతం నాన్ వెజ్ ను ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. చికెన్, మటన్, చేపలు మాత్రమే కాకుండా సీఫుడ్ ను ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. చేపలు, Fish, రొయ్యలు, prawns, crabs, పీతలు ఇలా రకరకాల సీ ఫుడ్ ని ఇష్టంగా తినేవారు ఉన్నారు. వీటిలో పీతలను ఇష్టపడేవారు సీజన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పీతల రుచి ఎంత బాగుంటుందో వాటిని బాగు చేసి వండడం కూడా అంతే కష్టం. అయితే పీతలతో పులుసు, ఫ్రై, బిరియాని వంటి వాటిని మాత్రమే కాకుండా పీతల ఆవకాయ పచ్చడిని కూడా పెట్టుకోవచ్చు. ఇక ఈ పీతల ఆవకాయ పచ్చడి గోదావరి స్టైల్ లో వండితే రుచి ఎంతో బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం పీతల ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు: 1) పీతలు, prawns 2) ఆవాలు Mustard 3) జీలకర్ర 4) ఇంగువ 5) నిమ్మరసం lemon juice 6) నువ్వుల నూనె 7) జీలకర్ర 8) కరివేపాకు 9) వెల్లుల్లి 10) కారం 11) పసుపు 12) ధనియాల పొడి తయారీ విధానం : ముందుగా 1/2 కేజీ చిన్న పీతలను తీసుకొని శుభ్రం చేసుకోవాలి. వాటిలో సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, నూనె వేసుకొని ఉడకబెట్టుకోవాలి. పీతలు ఆరంజ్ కలర్ లోకి వచ్చేవరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో నాలుగు స్పూన్ల నువ్వుల నూనె వేసి అందులో ఉడకబెట్టుకున్న పీతలను వేసి వంటను సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, ఒక స్పూన్ ఆవపిండి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత ఇందులో రెండు స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించిన పీతల ముక్కల్లో ఈ మసాలా మిశ్రమాన్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని స్టవ్ పై పెట్టి ఒక కప్పు నూనె వేసుకొని వేడి అయ్యాక ఒకటిన్నర టీ స్పూన్ ఆవాలు, ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకొని వేయించాలి. తర్వాత ఈ పోపును పీతల మసాలా మిశ్రమంలో వేసుకుని బాగా పీతలకు పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో రెండు స్పూన్ల నిమ్మరసం లేదా వెనిగర్ వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన పీతల ఆవకాయ పచ్చడి రెడీ, Crab avocado paste is ready, అయినట్లే. ఇది రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది. కావాల్సినప్పుడల్లా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.