Diwali Special Sweet : కేవలం పాలు, చక్కెరతో.. దీపావళి స్పెషల్ స్వీట్…!
Diwali Special Sweet : మరి కొద్ది రోజుల్లోనే దీపావళి పండుగ రాబోతోంది. పండుగ వస్తే మన ఇంట్లో ఖచ్చితంగా స్వీట్ అనేది ఉంటుంది. పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ నోటిని తీపి చేసుకుంటారు. అయితే దీపావళికి ఏ స్వీట్స్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే సులువుగా నెయ్యి, నూనె లేకుండా కేవలం పాలు చక్కెరతో ఈ స్వీట్లు తయారు చేసుకున్నారంటే మీ ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్వీట్ ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలోకి లీటర్ పాలను తీసుకోవాలి. ఈ పాలన స్టౌ పై పెట్టి బాగా వేడి చేయాలి. మరోపక్క గిన్నెలో ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని తీసుకోవాలి.
ఇందులోనే రెండు మూడు టీ స్పూన్ల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మరో పక్కన పాలు వేడి అవుతూ ఉంటాయి ఇలా వేడి అయిన పాలను మూడు నాలుగు నిమిషాలు మరగబెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కలుపుకున్న నిమ్మరసం వేసి బాగా కలిపి రెండు మూడు నిమిషాలు వదిలేస్తే పాలు, నీళ్లు వేరు అవుతాయి. ఇప్పుడు ఇందులో రెండు మూడు గ్లాసుల నీళ్లు పోసి అందులోని వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి. మళ్లీ ఒకసారి వాటర్ పోసి పన్నీర్ ని బాగా కడగాలి. జల్లెడ పై ఒక క్లాత్ వేసి పన్నీరు తీసుకోవాలి. పన్నీరుపై ఏదైనా బరువు ఉన్న బాక్సును పెట్టి గంటపాటు వదిలేయాలి.
తర్వాత తీస్తే పన్నీరు చాలా సాఫ్ట్ గా వస్తుంది. చేతితో కొద్దిగా అప్పలాగ అదిమి పీస్ లాగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ముప్పావు కప్పు చక్కెర వేసి పావు కప్పు నీళ్లు పోసి చక్కెర కరిగించుకోవాలి. తీగ పాకం వచ్చాక ఇందులో అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి రెడీగా పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి స్లోగా కలపాలి. రెండు మూడు నిమిషాలు కలిపాక స్టవ్ ఆఫ్ చేసి పాకం చల్లారింత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత పాకం అంతా పన్నీర్ ముక్కలకు పట్టాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన చెటా మూర్కి స్వీట్ రెడీ అయిపోయింది.