Carrot Sweet Recipe : పిల్లలకు నచ్చేలా ఎక్కువ కష్టపడకుండా నిమిషాల్లో క్యారెట్ తో రుచిగా ఈ స్వీట్ చేశారంటే ఇష్టంగా తింటారు…!!
Carrot Sweet Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ పుట్నాల పప్పు హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయమని అడిగితే ఇలా క్యారెట్ పుట్నాల పప్పుతో హల్వా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఈ హల్వా ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు : క్యారెట్, పుట్నాల పప్పు, యాలకుల పొడి, పంచదార, ఉప్పు,నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను. ఇలా పుట్నాల పప్పు వేసుకొని వీటిని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పిండిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే మిక్సీ జార్లో ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసి మెత్తటి మిశ్రమంలో పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఒక స్టవ్ పై ఒక కడాయిని పెట్టి ఒక కప్పు పంచదార వేసి దానిలో ఒక అరకప్పు నీటిని కూడా పోసుకొని తర్వాత ముందుగా పట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి. పంచదార అంతా కరిగి క్యారెట్ మిశ్రమంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్ మిశ్రమం అంతా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
ఇక పది నిమిషాల తర్వాత ఒక కప్పు నెయ్యిని కొంచెం కొంచెం పోస్తూ బాగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం దగ్గరగా అయిన తర్వాత యాలకుల పొడి వేసి మరల కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యిని వేస్తూ ఇదంతా దగ్గరగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ నెయ్యి అంత సపరేట్ అయ్యేవరకు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక హల్వా దగ్గరికి అయిన తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని దాంట్లో వేసి బాగా కలిపి స్టవ్ ఆపి వేరే బౌల్ లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా క్యారెట్ పుట్నాల పప్పు హల్వా రెడీ.ఈ హల్వా పిల్లలు ఒక్కసారి తిన్నారంటే మరల మరల చేయమని అడుగుతారు. అంతా బాగుంటుంది.