Vankaya Biryani : వంకాయ బిర్యానీ చేయడం ఎలా..?

Advertisement

Vankaya Biryani : ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ బిర్యాని.. ఈ వంకాయ బిర్యాని సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుంది. దీనిని ఒక్కసారి చేసి తిన్నారంటే ఇక చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీలు మానేసి ఈ వంకాయ బిర్యాని చేసుకొని తింటారు. అంతా బాగుంటుంది దీని టేస్ట్. ఎంతో టేస్టీ అయిన వంకాయ బిర్యానీ ఎలా తయారు చేయాలి ఇప్పుడు మనం చూద్దాం…

Advertisement

Vankaya Biryani : దీనికి కావాల్సిన పదార్థాలు

వంకాయలు, బాస్మతి రైస్, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, మెంతులు, పచ్చిశెనగ పప్పు, ఎండుకొబ్బరి ,పచ్చిమిర్చి, కారం, పుదీనా, కొత్తిమీర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాసపువ్వు, ఉప్పు, కొత్తిమీర, నెయ్యి, టమాటాలు మొదలైనవి…

Advertisement
How to make Eggplant Vankaya Biryani In Telugu
How to make Eggplant Vankaya Biryani In Telugu

Vankaya Biryani : దీని తయారీ విధానం

ముందుగా స్టవ్ పై ఒక గిన్నెను పెట్టి రెండు గ్లాసుల నీళ్లు వేసి దానిలో స్టార్ ఒక అనాసపువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు వేయాలి. వీటిని మరిగే వరకు మరిగించుకోవాలి. ఇంకొక పక్కు ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక రెండు స్పూన్లు పల్లీలు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం సాజీర రెండు లవంగాలు ఒక జాపత్రి ఒక స్టార్ వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేయించుకోవాలి. తర్వాత ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక పది ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇక వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దానిలో కొంచెం పసుపు, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు రుచి సరిపడినంత కారం తర్వాత ఎల్లిపాయలు అలాగే కొంచెం చింతపండు నానబెట్టింది వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి ఒక ముద్ద మిశ్రమంలో చేసుకోవాలి. ఇంకొక పక్క మరుగుతున్న నీటిలో ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఇంకొకపక్క మసాలాలు వేయించుకున్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీటెక్కిన తర్వాత దానిలో రెండు బిర్యాని ఆకులు కొంచెం కస్తూరి మేతి కొంచెం పుదీనా వేయించుకోవాలి.

Veg Dum Biryani Recipe in Telugu
How to make Eggplant Vankaya Biryani In Telugu

తర్వాత ఒక అర కప్పు ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. అలాగే వంకాయల్ని తీసుకుని శుభ్రం చేసుకుని వాటికి నాలుగు ఘట్లు పెట్టుకోవాలి. ఆ వంకాయలలో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని పెట్టుకోవాలి. తర్వాత ముందుగా ఉల్లిపాయలు వేగుతున్న మిశ్రమంలో ఒక కప్పు టమాట ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత వంకాయలు వేసి ముందుగా మసాలా మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 90% ఉడికిన అన్నాన్ని ఈ వంకాయల మిశ్రమంలో వేసి మూత పెట్టి స్టవ్ పై పెనం పెట్టి ఆ పెనంపై ఈ గిన్నెను పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకొని 35 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి కిందికి పైకి తిప్పుకొని దానిలో కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. అంతే వంకాయ బిర్యాని ఎంతో సింపుల్ గా రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది.

Advertisement
Advertisement