Hyderabadi Chicken Dum Biryani Recipe : పక్క కొలతలతో 25 మందికి హైదరాబాది చికెన్ బిర్యాని..!
Hyderabadi Chicken Dum Biryani Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యాని.. ఇది పక్కా కొలతలతో 25 మందికి సరిపోయే బిర్యాని చేసి చూపించబోతున్నాం. ఈ బిర్యానీ అల్టిమేట్ బిర్యానీ. ఈ బిర్యానీ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు : చికెన్, బాస్మతి రైస్, ఉల్లిపాయలు పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, షాహి జీరా, పచ్చిమిర్చి ,లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, బిర్యానీ ఆకులు, యాలకుల పొడి, బిర్యానీ, మసాలా కొత్తిమీర, నెయ్యి పుదీనా నిమ్మకాయలు, మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా స్టవ్ పై ఆయిల్ ని పెట్టుకొని దానిలోఒక పెద్ద కప్పు ఉల్లిపాయ ముక్కల్ని
వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద బిర్యాని గిన్నెను తీసుకొని దాన్లో ఒక కేజీ చికెన్ వేసుకొని దానిలో రెండు స్పూన్ల కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడినంత ఉప్పు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, యాలకులు, షాజీరా అనాసపువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యాని ఆకు యాలకుల పొడి, ఒక కప్పు పెరుగు, కొంచెం బ్రౌన్ ఆనియన్, కొంచెం నెయ్యి ఉల్లిపాయలు వేయించి మిగిలిన ఆయిల్ కొంచెం, కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న చికెన్ ని రెండు మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక గిన్నెను పెట్టి దానిలో ఏడు లీటర్ల నీటిని పోసి బాగా మరిగించాలి. ఆ మరుగుతున్న నీటిలో సరిపడా ఉప్పు నల్ల ఇలాచి బిర్యానీ ఆకు అనాస పువ్వులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, పచ్చిమిర్చి వేసి మీద బాగా మరిగించాలి.
తర్వాత ముందుగా నానబెట్టుకున్న రెండు కేజీల నర బియ్యాన్ని దాన్లో వేసి 80% ఉడికించుకోవాలి. ఆ ఉడుకుతున్న రైస్ లో పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలా 80% ఉడికిన రైస్ని తీసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో లేయర్ లేయర్ లాగా వేసుకోవాలి. మూడు లేయర్లుగా వేసుకొని స్పూన్ తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రైసు ఎక్కడ కూడా ఏగుడి దిగుడుగా లేకుండా సమానంగా పరుచుకోవాలి. అలా పరుచుకున్న రైస్ లో రెండు కప్పుల నీటిని పోసి తర్వాత కుంకుమ పువ్వుని పాలలో కలిపి పోసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ని కూడా వేసుకోవాలి. తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి.
తర్వాత కొంచెం గరం మసాల, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకొని ఈ గిన్నెకి మైదాపిండి చుట్టూ పెట్టి దానిపైన ప్లేటు పెట్టి బాగా అదుముకోవాలి. తర్వాత ఒకపక్క చిన్న హోల్ పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకోవడం వలన ఎంత ఉడికిందో మనకు తెలుస్తుంది. తర్వాత స్టౌ పై ఒక దోశ పెనం పెట్టి దానిపైన ఈ గిన్నెను పెట్టి బాగా దమ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి తర్వాత సిమ్ లో పెట్టి ఉంచాలి. తర్వాత స్టవ్ ఆపి ఒక 30 నిమిషాలు వదిలేయాలి. తర్వాత ఇక చూస్తే బిర్యాని రెడీ అయిపోతుంది. ఈ విధంగా పక్క కొలతలతో చేస్తే 25 మందికి ఈజీగా సరిపోతుంది.