Macaroni Pasta Recipe : ఆకలి వేసినప్పుడు తల్లులు లేకున్నా సాయంకాలం పిల్లలు చేసుకోగలిగే ఇనిస్టెంట్ పాస్తా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Macaroni Pasta Recipe : ఆకలి వేసినప్పుడు తల్లులు లేకున్నా సాయంకాలం పిల్లలు చేసుకోగలిగే ఇనిస్టెంట్ పాస్తా…!

 Authored By prabhas | The Telugu News | Updated on :31 October 2022,4:00 pm

Macaroni Pasta Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు వండటానికి అస్సలు టైం లేనప్పుడు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా నోటికి రుచిగా తినాలి అనుకుంటే ఈ రెసిపీ ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇది ఫాస్ట్ గా ఈజీగా పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు… ఇప్పుడు దీని తయారీ విధానం ఎలా చేయాలో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : పాస్తా, స్వీట్ కార్న్, ఆయిల్ ,వాటర్, ఉల్లిపాయలు క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం, టమాట ముక్కలు, పచ్చి బఠాణి, పాస్తా మసాలా, ఉప్పు, కొత్తిమీర,మొదలైనవి… తయారు చేసుకునే విధానం… ముందుగా స్టవ్ పై ఒక గిన్నెను పెట్టి దానిలో వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత పాస్తా అని దానిలో వేయాలి.

ఈ పాస్తా అనేది రకరకాలుగా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. మీకు ఇష్టమైన పాస్తా తీసుకోవచ్చు. పాస్తా అలా రెండు మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత దానిని తీసి స్పూన్ తో కట్ చేసుకుని చూసి కట్ అవుతుంది అనుకుంటే దానిని తీసి వడకట్టుకోవాలి. అలా వడకట్టుకున్న తర్వాత దానిలో కొన్ని చల్లటి నీళ్లను వేసి బాగా కడుక్కోవాలి. ఆ విధంగా కడిగిన పాస్తా అని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక పాన్ పెట్టి దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు క్యారెట్ తురుము, ఒక కప్పు క్యాబేజీ తురుము, ఒక కప్పు క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలను వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.

Instant Macaroni Pasta Recipe in Telugu

Instant Macaroni Pasta Recipe in Telugu

తర్వాత ఒక కప్పు పచ్చి బఠాణి ఒక కప్పు స్వీట్ కార్న్ వేసి బాగా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పాస్తా అని దానిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసి తర్వాత పాస్తా మసాలా అనేది మార్కెట్లో దొరుకుతుంది. దానిని తీసుకొచ్చి కొంచెం వేసి దానిపైన వాటర్ ని వేసి బాగా కలుపుకోవాలి అలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపుకోవచ్చు. ఇంకా ఇష్టం ఉన్నవాళ్లయితే స్ప్రింగ్ ఆనియన్ రకరకాలుగా యాడ్ చేసుకోవచ్చు. అంతే ఎంతో సింపుల్ గా ఈవినింగ్ స్నాక్లా చేసుకునే పాస్తా రెడీ .ఇది పిల్లలు కూడా ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది