Mushroom Recipe : మష్రూమ్ గ్రేవీ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హోటల్ రుచితో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mushroom Recipe : మష్రూమ్ గ్రేవీ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హోటల్ రుచితో…!

 Authored By prabhas | The Telugu News | Updated on :13 November 2022,7:30 am

Mushroom Recipe : ఇలా మసాలా నూరి గనుక మనం మష్రూమ్ కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రిడియంట్స్ తో పని లేకుండా రెస్టారెంట్ వస్తుందన్నమాట అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది రైస్ తో అయినా చపాతీ తో అయినా బిర్యానితో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ కర్రీ చేసేటప్పుడు నేను చెప్పినట్టుగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా లైక్ చేస్తారు. సో మరి ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా… దీనికోసం కావాల్సిన పదార్థాలు : మష్రూమ్స్, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర పొడి, ధనియాలపొడి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పెరుగు, ఉప్పు, కారం, నీళ్లు ఆయిల్ మొదలైనవి… ముందుగా స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకుని దానిలో ఆయిల్ వేసు కోవాలి.

కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది. అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క యాలుక్కాయలు అలాగే లవంగాలు జీలకర్ర కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/3 కప్పు దాకా బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగును వేసుకొని వేయించుకోవాలి. మీడియం సైజ్ లో ఉండే ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుందండి. చిన్నమైతే రెండు తీసుకోండి. గ్రేవీ అనేది మనకి చక్కగా రావాలి అంటే ఉల్లిపాయ నూనెలో బాగా వేగాలి. ఇలా ఉల్లిపాయ రంగు మారి నూనె తేలేంతవరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీస్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి.
ఇది వెగేలోపు మనం మసాలా తయారు చేసుకుందాం.

Mushroom Masala Gravy Curry Recipe in Telugu

Mushroom Masala Gravy Curry Recipe in Telugu

ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఒక పది జీడిపప్పులు, ఒక కప్పు టమాటా ముక్కలు, ఒక పావు ముక్క పచ్చి కొబ్బరి, ఒక రెండు స్పూన్ల పెరుగు వేసి పేస్ట్ చేసుకుని ముందుగా ఫ్రై చేస్తున్న ఉల్లిపాయ మిశ్రమంలో ఇది వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత దానిలో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 200 గ్రాముల మష్రూమ్స్ ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 4 ,5 పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా కలుపుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దానిలో నీళ్లను పోసి గ్రేవీ అనేది బాగా తిక్కుగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. అలా గ్రేవీ తిక్కగా అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా స్పీడ్ గా రెడీ అయ్యే కర్రీ మష్రూమ్స్ కర్రీ. దీనిని చపాతి రైస్ దేనిలోకైనా తీసుకోవచ్చు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది