Mutton Recipe : మటన్ ఎప్పుడు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా చేసుకోండి సూపర్ గా ఉంటుంది…!!
Mutton Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్క మటన్, చెట్టినాడు ట్రెడిషనల్ రెసిపీ మటన్ చుక్కానీ చేసి చూపిస్తాను. ఈ మటన్ లో వాడే మసాలాలు మాత్రం చాలా సింపుల్ గా ఉంటాయి. కానీ ఈ మటన్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రైస్, రోటి, పరోట దేనిట్లోకైనా తీసుకోవచ్చు. దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చుక్కానిమటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : మటన్, ఎండుమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, సాజీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కొత్తిమీర ఉప్పు మొదలైనవి.. దీని తయారీ విధానం : ముందుగా ఒక కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి దానిని కుక్కర్లో వేసి దానిలో ఒక స్పూన్ ఉప్పు,
ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత దానిలో ఒక యాలకుల మొగ్గ తర్వాత ఒక దాల్చిన చెక్క తర్వాత ఒక గ్లాసు నీళ్లు వేసి కుక్కర్ కి మూత పెట్టి ఐదు ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. తర్వాత ఈ మటన్ లోకి మసాలాల కోసం ఒక పాన్ లో రెండు స్పూన్ల మిరియాలు, ఒక స్పూన్ సోంపు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు అలాగే నాలుగు ఎండుమిర్చి తర్వాత దాల్చిన చెక్క యాలకులు వేసి వేయించి వాటిని మెత్తటి పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఉడికించుకున్న మటన్ ను తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ ని నీళ్ళ తో సహా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలాలు కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా నీరంతా ఇంకెవరకూ ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత దాన్లో కొంచెం కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి.దీనిలో కారం కావాలి అనుకున్న వాళ్లు వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మిరియాలు ఎండి మిరపకాయలు సరిపోతుంది. అయితే పూర్తిగా నీరంతా ఇంకే పోయేవరకు బాగా కలుపుకొని చివరగా కొత్తిమీర జల్లుకొని దింపుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా మటన్ ఫ్రై రెడీ అయిపోయింది.