New Snacks Recipe : బ్రెడ్ ఇంకా ఉల్లిపాయతో తయారు చేసిన యూనిక్ రెసిపీ చూసిన వెంటనే మీరు ఇంట్లో చేసేసుకుంటారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

New Snacks Recipe : బ్రెడ్ ఇంకా ఉల్లిపాయతో తయారు చేసిన యూనిక్ రెసిపీ చూసిన వెంటనే మీరు ఇంట్లో చేసేసుకుంటారు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :9 January 2023,7:00 am

New Snacks Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఇంకా ఉల్లిపాయతో తయారు చేసే డిఫరెంట్ రెసిపీ… మీకు స్పెషల్ గా ఏదైనా తినాలి అనిపించినప్పుడు బ్రెడ్ ఉల్లిపాయతో చేసే ఈ డిఫరెంట్ స్నాక్ ని తయారు చేసుకుని తినొచ్చు. దీని టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పన్నీర్, శెనగపిండి, బియ్యప్పిండి, వాము ఆయిల్, మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా నాలుగైదు ఎల్లిపాయల్ని తీసుకొని మిడిల్ గా కట్ చేసుకొని లేయర్లన్నీ విడిగా తీసుకోవాలి. ఈ పెద్ద లేయర్లని పక్కన పెట్టుకొని మిగతావన్నీ సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి.

తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వేయాలి. అవి కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ కారం తర్వాత కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉడకబెట్టుకొని ఆలుగడ్డని గ్రేడర్స్ తో స్మాష్ చేసుకున్న ఆలూ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. ఇక తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. ఇక తర్వాత ఈ మిశ్రమం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు శెనగపిండి ఇంకొక కప్పు బియ్యప్పిండి కూడా వేయాలి. తర్వాత వన్ టీ స్పూన్ వాము నలిపి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుని

New Snacks Recipe in Telugu on video

New Snacks Recipe in Telugu on video

పల్చగా కలుపుకోవాలి. తర్వాత ఆలు మిశ్రమంలో పన్నీర్ని తురుముకొని వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకుని మనం ముందుగా లేయర్లుగా తీసుకున్న ఉల్లిపాయ తొక్కలో పెట్టుకొని రెండు వైపులా పెట్టుకోవాలి. తర్వాత వైట్ బ్రెడ్ ని తీసుకుని నీటిలో ముంచి తీసేసి నీటిని పిండేసి ఈ ఉల్లిపాయ స్టప్ ని దాంట్లో పెట్టి రౌండ్ గా కవర్ చేసుకోవాలి. అన్నిటినీ బ్రెడ్ లో ఉల్లిపాయ మిశ్రమం ని పెట్టి కవర్ చేసి అన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆ ముద్దులని మనం ముందుగా కలిపి పెట్టుకున్న సెనగపిండి మిశ్రమంలో డిప్ చేసి ఈ ఆయిల్లో వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అంతే అన్నిటిని కూడా సేమ్ అలాగే వేయించుకొని తీసి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా బ్రెడ్ ఇంకా ఉల్లిపాయతో డిఫరెంట్ రెసిపీ రెడీ అయింది…

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది