Onion Pachadi Recipe : ఉల్లి పచ్చడి నోటికి రుచిగా.. అన్నం, చపాతీకి, టిఫిన్ లోకి చాలా బాగుంటుంది…!!
Onion Pachadi Recipe : ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా ఉల్లిపాయ పచ్చడి ఈజీగా చేసే ప్రాసెస్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది నోటికి రుచిగా.. అన్నం, చపాతి ,టిఫిన్ లోకి చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి.. దీనికి కావాల్సిన పదార్థాలు : ఉల్లిపాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లిపాయలు, కరివేపాకు, ధనియాలు, వెండి మిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, ఇంగువ, ఆవాలు మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఉల్లిపాయలు తీసుకుని పొడువుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకుని మూడు గిన్నెల ఆయిల్ వేసుకొని తర్వాత ఆ ఆయిల్ లో పచ్చిశనగపప్పు, రెండు స్పూన్లు, రెండు స్పూన్ల మినప గుండ్లు వేసి కొద్దిసేపు ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించాలి. దాని తర్వాత ఐదారు ఎన్ని మిరపకాయలని కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని దాన్లో వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక రెండు స్పూన్ల కారం, కొంచెం చింతపండు ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించి తర్వాత తీసి చల్లారిన తర్వాత
మిక్సీలో వేసి బరకగా కావాలంటే బర్కక లేదంటే మెత్తగా పేస్టులా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న ఉల్లిపాయ చట్నీని పోపు వేయడానికి ముందుగా ఉల్లిపాయలు వేయించిన కడాయిలు మరో స్పూన్ ఆయిల్ వేసి దానిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం కరివేపాకు, నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి అలాగే కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలి. తర్వాత మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ చట్నీ ఆ పోపులో వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి ఈ చెట్నీని వేరే బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా ఉల్లిపాయ చట్నీ రెడీ.. ఇది నోటికి రుచిగా.. చపాతి, అన్నం, రోటి దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.