Paneer Biryani Recipe : పన్నీర్ బిర్యానీ ఒకసారి ఇలా ట్రై చేసి రుచి చూడండి సూపర్ గా ఉంటుంది.
Paneer Biryani Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యాని. ఈ బిర్యానీని టేస్టీగా, ఈజీగా ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఈ పన్నీర్ బిర్యాని చేసేయొచ్చు. ఓకే అండి ఈ పన్నీర్ బిర్యానీని మనం ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి.. దీనికి కావాల్సిన పదార్థాలు : బిర్యానీ ఆకు, జీడిపప్పులు, షాజీరా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, స్టార్, లవంగాలు యాలకులు, దాల్చిన చెక్క, బండ పువ్వు, పన్నీర్ ముక్కలు, బాస్మతి రైస్, కారం, పసుపు, ఉప్పు ,టమాటాలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాల, ధనియాల పౌడర్, మొదలైనవి…
దీని తయారీ విధానం : ముందుగా బాస్మతి రైస్ ని రెండు కప్పులు తీసుకొని బాగా కడిగి గంట వరకు నానబెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక పాన్ పెట్టి దానిలో నెయ్యి వేసి ఈ పన్నీర్ ముక్కల్ని వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యేవరకు వేయించి తర్వాత దానిపై కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి కొద్దిసేపు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌపై కుక్కర్ని పెట్టి దాంట్లో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క, ఒక స్టార్, ఒక అనాసపువ్వు, కొంచెం సాజీర, నాలుగు జీడిపప్పులు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించిన తర్వాత దాంట్లో ఒక కప్పు టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి.
తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి దానిపైన ధనియాల పౌడర్, గరం మసాలా వేసి కొద్దిసేపు వేయించిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ని దాంట్లో వేసి బాగా కలుపుకొని తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ ని పోసి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి తర్వాత కుక్కర్ కి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి బిరియాని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో సింపుల్గా ఈజీగా, టేస్టీగా పన్నీర్ బిర్యాని రెడీ.