Parda Chicken Dum Biryani : ఇది కదా అసలు పరదా చికెన్ దమ్ బిర్యాని అంటే…!
Parda Chicken Dum Biryani : పరదా చికెన్ దమ్ బిర్యాని బిర్యాని లవర్స్ కి ఈ బిర్యాని చాలా నచ్చుతుంది. చికెన్ సాఫ్ట్ గా కుక్ చేసి పిండి ముద్దలు రైస్ తో పాటు చికెన్ వేసి సీల్ చేసి దమ్ చేసేదాన్ని పరదా చికెన్ దమ్ బిర్యాని అంటారు. ఇది చాలా ఫ్లేవర్ ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు; బాస్మతి రైస్, చికెన్ ,కారం, ఉప్పు, గరం మసాలా, సాజీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, దాల్చిన చెక్క, నల్లయాలకు, జాపత్రి పొడి, పెరుగు, నిమ్మరసం, జీలకర్ర పొడి, ఆయిల్, నెయ్యి ,మైదా, బేకింగ్ పౌడర్, కొత్తిమీర, పుదీనా, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు మొదలైనవి…దీని తయారీ విధానం : ముందుగా రెండు కప్పుల బాస్మతి రైస్ ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి.
తర్వాత ఒక బౌల్ లోకి చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం నిమ్మరసం, కొంచెం గరం మసాలా, జాపత్రి పౌడర్, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ,జీలకర్ర పొడి, కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టి దానిలో రెండు లీటర్ల నీళ్లు వేసి దానిలో నాలుగు పచ్చిమిర్చి చీలికలు నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు, నాలుగు నల్ల యాలకులు వేసి మూత పెట్టి బాగా మరిగించుకుని మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ని దాంట్లో వేసి ఉడికించుకోవాలి. ఇంకొకపక్క ఒక కడాయి పెట్టుకుని దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు ఒక కప్పు ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకొని ఆ ఉల్లిపాయలను కొంచెం తీసి పక్కన ఉంచుకొని దానిలో చికెన్ వేసి బాగా కుక్ అవనివ్వాలి.

Perfect Parda Chicken Dum Biryani Recipe in Telugu
అలా బాగా ఉడికిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇక రైస్ ని కూడా ఆల్మోస్ట్ అంత ఉడికే వరకు ఉంచుకొని తీసి వడకట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక తర్వాత మైదా తీసుకుని దానిలో కొంచెం నెయ్యి కొంచెం పెరుగు కొంచెం సోడా ఉప్పు వేసి బాగా మెత్తగా స్మూత్ గా కలుపుకొని దానిని పెద్ద చపాతి లాగా చేసుకుని ఒక బౌల్లో నెయ్యిని రాసి ఈ చపాతీని దానిపైన వేసి వెడల్పుగా దాన్లో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ని ఒక లేయర్ వేసి తర్వాత కొంచెం చికెన్ కూడా వేసి మళ్లీ పైన రైస్ వేసి కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్ కొంచెం నెయ్యి, కొంచెం కుంకుమపువ్వు కూడా చల్లి ఆ చపాతీ అంతా మంచిగా క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో బాగా ఆ రొట్టెని ఉడికించుకోవాలి. అలా రొట్టె బాగా ఎర్రగా కాలిన తర్వాత మళ్లీ దానిపైన దోశ పెనాన్ని పెట్టి ఇంకొక వైపు టర్న్ చేసుకొని దానిపైన నెయ్యి వేసి అటువైపు కూడా ఎర్రగా క్రిస్పీగా కాల్చుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా పరదా చికెన్ దమ్ బిర్యాని రెడీ..
