Munagaku Pappu : ఎన్నో పోషకాలు ఉన్న మునగాకు పప్పుని ఇలా తయారు చేసుకొని తినండి…
Munagaku Pappu : ఈ రోజు రెసిపీ వచ్చేసి మునగాకు పప్పు.. పప్పు అంటే అందరూ ఇష్టంగానే తింటూ ఉంటారు. దీనిలో ఎన్నో మాంసపుకృత్లు అలాగే ప్రోటీన్స్ ఉంటాయి. అయితే ఈ పప్పుకి మునగాకు తోడైతే ఇంకా గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. మునగాకు లో ఎన్నో పోషకాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే మునగాకుని డైరెక్టుగా తీసుకోవాలి అంటే ఎవరు తీసుకోరు. కనుక ఈ విధంగా చేసి తీసుకోవచ్చు.. ఈ మునగాకు పప్పును ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం…
Munagaku Pappu : దీనికి కావలసిన పదార్థాలు
మునగాకు, కందిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు,పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పసుపు, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, ఆవాలు, మినప్పప్పు, కొత్తిమీర, జీలకర్ర, ఆయిల్ మొదలైనవి…
Munagaku Pappu : దీని తయారీ విధానం
ముందుగా కందిపప్పును ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి ముందుగా మునగాకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్ లో మినప్పప్పు ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చనగపప్పు తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత ఒక పావు కప్పు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత అవి వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేయాలి. తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. మూత పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకుని కూడా వేసుకోవాలి.
అది కూడా వేసి కొద్దిసేపు వేయించుకొని తర్వాత వెల్లుల్లి సన్నగా తురుముకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసి కొద్దిసేపు స్టవ్ ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇక ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా మునగాకు పప్పు రెడీ అయిపోయింది.. ఈ పప్పుని పిల్లలకి పెడితే ఎన్నో ప్రోటీన్స్ ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ మునగాకు డైరెక్ట్ గా తీసుకోలేం కాబట్టి ఈ విధంగా పప్పులు వేసుకొని తీసుకోవచ్చు…