Protein Rich Adai Dosa Recipe : రోజు ఒక్కటి తిన్నా చాలు పోషకాల లోపం ఉండదు…!
Protein Rich Adai Dosa Recipe : మల్టీ గ్రైన్ అడై దోశ .పెసలు, సెనగలు, అలసందలు, మినప్పప్పు, బియ్యం, కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తగా రుబ్బి అట్టు కాల్చినట్లు కాల్చి పైన పొడి చల్లి ఇచ్చేది తమిళనాడు స్పెషల్ అడై రెసిపీ. తమిళనాడు వాళ్లు అడై యిలు చాలా వెరైటీలు చేస్తూ ఉంటారు. అందుట్లో ఇది ఒకటి. మనం ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : ముడి పెసలు, అలసందలు, మినప్పప్పు, ముడి సెనగలు, బియ్యం, పచ్చికొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు ,జీలకర్ర, వెల్లుల్లి, నూనె, అలాగే
అడై పొడి కోసం; పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర ,వెల్లుల్లి ,ఉప్పు మొదలైనవి.. అడై కోసం ముందు రోజే మంచి శనగలు, పెసలు, అలసందలు, మినప్పప్పు పప్పులన్నీ రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు పప్పులతో పాటు అడై కోసం ఉంచిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, బియ్యం మిగిలిన పదార్థాలన్నీ వేసి కొంచెం రవ్వగా పిండి గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న పిండిలో కొంచెం ఉప్పు తగినన్ని నీళ్లు పోసి కాస్త చిక్కగా పిండి కలుపుకోని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొడి కోసం ఉంచిన మినప్పప్పు, పచ్చిశనగపప్పు, నువ్వులు, వెండి మిర్చి, కరివేపాకు, జీలకర్ర ,వెల్లుల్లి, ఉప్పు వేసి బాగా వేయించుకొని అవి చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన ఉంచుకోవాలి.
తర్వాత స్టౌ పై పెనం పెట్టి బాగా వేడి చేసి పెద్ద గరిటడు పిండి పోసి కాస్త మందంగా పిండి అట్టు మాదిరి స్ప్రెడ్ చేసుకోవాలి. కాలుతున్న అట్టు అంచుల వెంట నూనె వేసి కాల్చుకోవాలి. తర్వాత అట్టుపై ముందుగా చేసి పెట్టుకున్న పొడి మొత్తం చల్లుకోవాలి. అట్టు ఒకవైపు ఎర్రగా కాలాక తిరగతిప్పి మరో వైపు 30 సెకండ్లు మాత్రమే కాల్చుకోవాలి. అంతే అడై అట్లు రెడీ. వేడి వేడిగా కొబ్బరి చట్నీతో, అల్లం చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.