Ragi Paratha Recipe : రాగి పరోటా ఎముకల్ని బలంగా మార్చే కమ్మని మృదువైన పరోటా…!
Ragi Paratha Recipe : ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మని రాగి పిండితో హెల్దీగా చేసుకునే తినే రొట్టెని చూపించబోతున్నాను చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మరి ఎంతో రుచిగా ఈ మృదువైన హెల్దీ పరోటానికి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి.. దీనికి కావాల్సిన పదార్థాలు : రాగి పిండి, గోధుమపిండి, ఉప్పు, నీళ్లు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వాము, ధనియాల పొడి, పసుపు, ఆమ్చూర్ పౌడర్, అటుకుల పొడి, Copper flour, Wheat flour, Salt, Water, Potatoes, Onions, Green chillies, Coriander, Ginger, Vam, Coriander powder, Turmeric, Amchur powder, Atukula powder, మొదలైనవి.. దీని తయారీ విధానం : ముందుగా కలపడానికి ఒక గిన్నెలోకి ఒక కప్పు రాగి పిండిని తీసుకోండి.
ఇక్కడ నేను ప్యాకెట్ లో దొరికే రెడీమేడ్ రాగి పిండిని వాడుతున్నాను అండి. ఇందులోనే మరోకప్పు గోధుమ పిండిని తీసుకోండి.మొత్తం రాగి పిండితో కాకుండా ఇలా గోధుమపిండి వేసి చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత నీళ్లను కొంచెం కొంచెం గోరువెచ్చగా చేసి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.తర్వాత మూడు ఆలుగడ్డలను తీసుకొని వాటిని ఉడికించి వాటిని తరుముకొని ఒక గిన్నెలో వేసుకొని దానిలో కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఆమ్చూర్ పౌడర్, అటుకుల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఉండల చేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న
రాగి పిండిని కూడా ముద్దలా చేసుకుని దాన్లో ఈ స్టఫింగ్ పెట్టి చపాతీ లాగా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న పరోటాల్ని చేసిపెట్టుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దానిపై ఈ పరోటాని ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఎర్రగా కాల్చుకోవాలి. తర్వాత కొద్దిగా బటర్ వేసి రెండు వైపులా ఈ రాగి పరోటాల్ని ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా రాగి పరోటాలు రెడీ. ఎంతో కమ్మగా, మృదువుగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా చేసుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు తీసుకోవచ్చు… ఈ విధంగా చేసి పెట్టుకున్న పరోటాలని హాట్ బాక్స్ లో పెట్టుకుంటే గంట రెండు గంటల వరకు హాట్ గా ఉంటాయి.