Rava Breakfast Recipe : ఎప్పుడు చేసే ఇడ్లీ, దోశలు కాకుండా అరిటాకులో ఇలా రుచిగా చేయండి ఆరోగ్యానికి మంచిది…!
Rava Breakfast Recipe : రోజు మనం ఎప్పుడు చేసుకునే ఇడ్లీ, దోశలు కాకుండా అరిటాకులో హెల్తీగా బ్రేక్ ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము.. ఈ రెసిపీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు అరటి ఆకులు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, క్యాప్సికం, వంటసోడా, మొదలైనవి… ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు ఉప్మా రవ్వ, ముప్పావు కప్పు పెరుగు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరిటాకులను తీసుకొని వాటిని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు అరిటాకులను స్టవ్ మీద లైట్ గా వేడి చేసుకోవాలి.
అరిటాకులలో వేడి చేయడం వల్ల చినిగిపోకుండా మనకి ఫోల్డ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత రవ్వ ,పెరుగును పీల్చుకొని గట్టిగా అవుతుంది. ఇప్పుడు రవ్వలో ఒక టీ స్పూన్ అల్లం తరుగు ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ కొద్దిగా కొత్తిమీర తరుగు పావు టీ స్పూన్ వంట సోడా కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఈ పిండిని అరటి ఆకులలోవేసుకోవాలి. మీ దగ్గర ఒకటే అరిటాకు పెద్దది ఉంటే దాంట్లో వేసుకోండి ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.. పిండి అంతా వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని దారంతో కానీ అరిటాకు పుల్లలతో కానీ ముడి వేసుకోవాలి. తర్వాత పాన్ లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అరిటాకు పొట్లం పెట్టుకొని అందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి.
ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఒక మరుగు రానివ్వాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత చాకుతో గాని టూత్ పిక్ తో కానీ ఇలా చెక్ చేస్తే మనకు క్లీన్ గా వస్తుంది. మీకు క్లీన్ గా రాకుండా పిండి తగిలితే కనుక మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అరిటాకులు ఓపెన్ చేస్తే రవ్వ బాగా ఉడికిపోయి ఉంటుంది. ఈ రెసిపీని అరిటాకులో చేసుకోవడం వలన అరిటాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. ఇప్పుడు చాకుతో మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్ని వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. దీనిని మనం ఊరగాయ పచ్చడితో తినొచ్చు. రోటి పచ్చడిలతో కూడా చాలా బాగుంటుంది.
