Rava Dosa Recipe : షుగర్ ఉన్న వాళ్లు కూడా హ్యాపీగా తినగలిగే దోశలు మరియు చట్ని నిమిషాలలో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rava Dosa Recipe : షుగర్ ఉన్న వాళ్లు కూడా హ్యాపీగా తినగలిగే దోశలు మరియు చట్ని నిమిషాలలో…!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 November 2022,7:30 am

Rava Dosa Recipe : ఈరోజు మనం చాలా త్వరగా చేసుకునేటటువంటి ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని నేర్చుకుందామండి. దీంతోపాటు నేను మీకు చట్ని కూడా చేసి చూపిస్తాను. చాలా మెత్తగా వచ్చాయో ఈ చట్నీతో తింటే చాలా బాగుంటాయి. మీరు టిఫిన్ కి నైట్ ఏమి వేయకపోయినా ఉదయం ఫాస్ట్ ఫాస్ట్ గా చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మరి వీటిల్ని ఎలా తయారు చేయాలో చూపించేస్తాను… దీనికోసం కావాల్సిన పదార్థాల : వాటర్, ఎండి మిరపకాయలు, గోధుమ రవ్వ, మజ్జిగ, టమాటాలు, ఎల్లిపాయలు, ఉప్పు, ఆయిల్, మెంతులు, ఆవాలు, జీలకర్ర కొంచెం కరివేపాకు, వంట సోడా మొదలైనవి…

దీని తయారీ విధానం : ముందుగా ఒక అయిదారు ఎండు మిరపకాయలని తీసుకొని వేడి నీటిలలో వేసి కొద్దిసేపు ఉంచుకోవాలి. తర్వాత దోశ బెటర్ కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి దానిలోకి ఒక కప్పున్నర మజ్జిగ వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. తర్వాత చట్నీ కోసం టమాట ముక్కలను ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ముందుగా వేడి నీటిలో నానబెట్టుకున్న ఎండి మిరపకాయలని కూడా దానిలో వేసి తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు వేసి మెత్తని పేస్టులా పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయిని పెట్టి దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో ముందుగా కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం మెంతులు వేసి దానిలో కొంచెం పసుపును కూడా వేసి బాగా వేయించుకొని ముందుగా చేసి పెట్టుకున్న చట్ని మిశ్రమాన్ని వేసి బాగా ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడకనివ్వాలి.

rava dosa recipe in telugu

rava dosa recipe in telugu

అలా ఆయిల్ సెపెరేట్ అయిన తర్వాత దానిని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇక తర్వాత దోశ బ్యాటర్ని చూస్తే.. మజ్జిగలో నానబెట్టుకున్న గోధుమ రవ్వ నాని ఉంటుంది. ఆ మజ్జిగ గోధుమ రవ్య ని మిక్సీలో వేసి మెత్తని దోష బ్యాట్ ర్ల పట్టుకొని దానిలో కొంచెం ఉప్పు కొంచెం వంట సోడా వేసి బాగా కలుపుకొని తీసి పక్కన ఉంచుకొని.. స్టౌ పై దోశ పెనాన్ని పెట్టి కొంచెం ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత దోశలు వేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా షుగర్ పేషెంట్లు కూడా తినే దోశలు అలాగే చట్ని సింపుల్గా రెడీ అయిపోయిందండి. అయితే ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ దోశల్ని వేడివేడిగానే తినేయాలి. లేకపోతే తర్వాత అస్సలు టేస్టీగా ఉండవండి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది