Ribbon Pakoda Recipe : అచ్చం స్వీట్ షాప్ లోది లాగానే .. కరకరలాడే రిబ్బన్ పకోడా .. ఎంతో ఈజీగా మీకోసం ..!!
Ribbon Pakoda Recipe : స్వీట్ షాప్ లలో దొరికే రిబ్బన్ పకోడాను ఈజీగా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే అచ్చం స్వీట్ షాపులోని రిబ్బన్ పకోడా లాగా రుచిగా ఉంటుంది. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ గా వీటిని చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పక్కా ఈ కొలతలతో చేశారంటే రుచిగా కరకరలాడుతూ వస్తాయి. అలాగే ఇవి ఎక్కువ రోజులు కూడా నిలువ చేసుకోవచ్చు. ప్రతిరోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ గా వీటిని పెట్టవచ్చు. మరి ఇంకేందుకు ఆలస్యం, రిబ్బన్ పకోడాను ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు: 1) బియ్యం పిండి 2) శనగపిండి 3) పుట్నాల పిండి 4) ఉప్పు 5) కారం 6) పసుపు 7) నల్ల నువ్వులు 8) వాము 9) నెయ్యి తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పులు బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి. తర్వాత ఒక కప్పు శనగపిండిని కూడా జల్లించి తీసుకోవాలి. తర్వాత ఇందులో ముప్పావు కప్పు పుట్నాల పప్పు పొడి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, వన్ టీ స్పూన్ కారం, వన్ టీ స్పూన్ వాము, రెండు టీ స్పూన్ల నల్ల నువ్వులు, చిటికెడు పసుపు, వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండిని కలపాలి.
పిండి మరి పలుచగా కాకుండా మరి గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి మండను మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి. ఇప్పుడు రిబ్బన్ పకోడా చేసుకోవడానికి అల్యూమినియం గొట్టం తీసుకొని కొద్దికొద్దిగా వేసుకుంటూ వేడి చేసిన ఆయిల్ లో వేయాలి. రిబ్బన్ పకోడాను అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన రిబ్బన్ పకోడా రెడీ అయిపోయింది. పూర్తిగా చల్లారాక ఈ రిబ్బన్ పకోడాను ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకొని ప్రతిరోజు తినవచ్చు.