Chikki Recipe : వెరైటీగా గవ్వల చిక్కి… ఇలా తయారు చేసుకోండి…!
Chikki Recipe : పల్లి చిక్కి తెలుసు కానీ ఈ గోధుమ పిండితో గవ్వలుచిక్కి ఏంటి అని అనుకుంటున్నారా. పల్లి చిక్కి ఎలా చేస్తామో అలాగే గోధుమపిండితో చిక్కిని ఈ విధంగా చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. గోధుమ పిండితో ఇలా చిక్కి చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎప్పుడు పల్లీలతో చిక్కి చేయడం కాకుండా ఈసారి ఇలా వెరైటీగా గోధుమపిండి చిక్కిని ట్రై చేసి చూడండి. అయితే ఇప్పుడు గోధుమపిండి చిక్కిని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తయారీ విధానం: ముందుగా గోధుమపిండి రెండు కప్పుల వరకు తీసుకోవాలి.
అందులో పావు కప్పు వేడి వేడి నూనెను పోసుకోవాలి. ఈ నూనెలో పిండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి మొత్తం ఆయిల్ కి కలిసేలాగా చేతితో బాగా రబ్ చేయాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరి సాఫ్ట్ గా కాకుండా మీడియాంగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి ముద్ద ఆరి పోకుండా పైన కొద్దిగా ఆయిల్ రాయాలి. ఇందులో కొద్దిగా పిండిని తీసుకొని మిగతా పిండిని ఆరిపోకుండా ఒక క్లాత్ వేయాలి. ఇప్పుడు ఆ పిండిని చిన్నచిన్న గవ్వలు లాగా చేసుకోవాలి.
ఇప్పుడు డీ ఫై కి సరిపడా ఆయిల్ వేసి ఆ గవ్వలను ఫ్రై చేయాలి. గవ్వలు గోల్డెన్ కలర్ వచ్చాక తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మొత్తానికి నెయ్యి పూయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల తురిమిన బెల్లం, రెండు మూడు టీ స్పూన్ల వాటర్ పోసి కరిగించుకోవాలి. గట్టి పాకం వచ్చేవరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న చిన్న గవ్వలు వేసి బాగా కలుపుకోవాలి. వెంటనే నెయ్యి పూసుకున్న ప్లేట్లో వేసి ఒక గిన్నెతో స్ర్పెడ్ చేయాలి. పూర్తిగా చల్లారాక చాక్ తో కట్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే గవ్వల చిక్కి రెడీ అయిపోయింది.