Pongali Recipe : ప్రాచీన పద్ధతిలో ఖచ్చితమైన చక్కెర పొంగలి రెసిపీ..!
Pongali Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రాచీన కాలంనాటి చక్కెర పొంగలి ఇది అసలైన పొంగలి. దీనిని దేవుడికి నైవేద్యం పెట్టడమే కాదు ఇంట్లో చేసుకొని తిన్న కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. కచ్చితంగా ఈ కొలతలు పాటిస్తే చక్కెర పొంగలి ఒక రేంజ్ లో వస్తుంది. ఈ ప్రాచీన పద్ధతిలో చక్కెర పొంగలి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీని తయారీ విధానం : పెసరపప్పు, బియ్యం, నెయ్యి, జీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి, బెల్లం, పంచదార, తేనె మొదలైనవి…
ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దోరగా పండురంగలోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కప్పుతో బియ్యాన్ని తీసుకొని రెండిటిని కలిపి శుభ్రంగా కడిగి ఒక బౌల్లో నాలుగు కప్పుల నీళ్లను వేసి ఈ బియ్యం పప్పుని కూడా అందులో వేసి 90% వరకు ఉడికించుకోవాలి. అన్నం కొంచెం పలుకు పలుకులుగా ఉండంగానే స్టవ్ ఆపుకోవాలి. ఇంకొకపక్క స్టవ్ పై ఒక గిన్నెను పెట్టి దానిలో ఒక కప్పు బెల్లం, అర కప్పు పంచదార వేసి బాగా కరిగిన తర్వాత దాన తీసి వడకట్టుకుని దానిని మళ్లీ స్టవ్ పై పెట్టి తీగ పాకంలో వచ్చేవరకు మరిగించి దాన్లో ముందుగా ఉడికించుకున్న రైస్ ని తీసుకుని ఈ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుతూ ఉన్న తర్వాత ఒక పావు కప్పు నెయ్యిని కూడా వేసి మళ్లీ కలుపుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు తేనె కూడా వేసి బాగా కలపాలి. ఇది దీనిలో అసలైన సీక్రెట్. ఈ తేనె వేస్తే ఈ చక్కెర పొంగలి కలర్ మారటమే కాకుండా రుచి అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక స్టవ్ పై బాండీ పెట్టి దానిలో నెయ్యిని వేసి దానిలో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేయించి వాటిని కూడా తీసుకొని ఈ చక్కెర పొంగల్ లో వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో సింపుల్గా ప్రాచీన పద్ధతిలో ఖచ్చితమైన చక్కెర పొంగలి రెసిపీ రెడీ అయింది. దీనిని ఒక్కసారి తిన్నారంటే ఇక జీవితంలో మర్చిపోలేరు. అంత బావుంటుంది.