Usirikaya Pachadi Recipe : అప్పటికప్పుడు చేసుకునే ఉసిరికాయ తొక్కు పచ్చడి.. ఒకసారి చేస్తే నెలరోజులు తినొచ్చు..!
Usirikaya Pachadi Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో ఔషధ గుణాలు ఉండే ఉసిరికాయతో మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను. ఔషధం అనే పేరులోనే ఉంది కదా.. కొద్దిగా తీసుకున్న చాలు అది మన బాడీకి ఎంతో మంచి చేస్తుంది. మనకి తెలిసినవి కొన్ని తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉండే ఈ ఉసిరికాయతో పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఉసిరికాయలు దొరికే టైం లోనే రకరకాల వెరైటీ రెసిపీస్ ఉసిరికాయలతో ట్రై చేసి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఉసిరికాయతో చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఉసిరికాయతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని పచ్చడి ఎలా చేసుకోవచ్చు చూసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు : ఉసిరికాయలు, ఎండు మిరపకాయలు, జీలకర్ర ,ఆవాలు మినప్పప్పు, కొత్తిమీర, ఇంగువ, పసుపు, ఉప్పు, ఎల్లిపాయలు, మొదలైనవి… దీని తయారీ విధానం : ఈ ఉసిరికాయ పచ్చడి కోసం పది నుంచి 12 దాకా మీడియం సైజులో ఉండి ఉసిరికాయలు తీసుకోండి.
ఉసిరికాయల్ని శుభ్రంగా నీళ్లతో కడిగేసుకుని తడి లేకుండా పొడి గుడ్డుతో తుడిచేసేసి పిక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. దానిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరిముకులన్నీ వేయండి. అలాగే అర టి స్పూన్ దాక పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసేసి ఈ ఉసిరి మొక్కల్ని నూనెలో కొద్దిసేపు వేయించాలి. ఉసిరిముక్కలనేవి చక్కగా మగ్గిపోయాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి హాఫ్ టీ స్పూన్ దాక మెంతులు, రెండు టీ స్పూన్ల దాకా మినప్పప్పు, కూడా వేసుకుని దోరగా ఫ్రై చేయండి. నెక్స్ట్ కారానికి తగ్గట్టుగా పది నుంచి 12 దాకా ఎండుమిర్చి వేసుకోండి. అలాగే రెండు రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసేసి జస్ట్ ఒకసారి ఎండుమిర్చి వేగేంత వరకు వేయించేసి స్టవ్ ఆపేసేయండి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి చల్లారిన వీటన్నిటిని కూడా మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
దానిలోకి ఒక 6 లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫైన్ గా వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరి ముక్కల్ని దానిలో వేసేసేయండి. అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండుకోవాలి. ఈ పచ్చడిలో ఇలా నిమ్మరసం వేయటం వల్ల ఇందులో ఉండే వగరుతనం అనేది తగ్గిపోతుందన్నమాట. పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను వాటర్ అస్సలు యూస్ చేయలేదండి. వాటర్ వేస్తే పచ్చడి త్వరగా పాడైపోతుంది. వాటర్ అస్సలు యూస్ చేయకుండా చెమతగలకుండా పచ్చడి గనుక చేసుకుంటే కనీసం నెల రెండేళ్ల పాటు ఈ పచ్చని స్టోర్ చేసుకోవచ్చండి.
ఇప్పుడు మనం ఈ పచ్చడి కి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేయండి. నూనె హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆవాలు, హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక ఎండుమిర్చి అలాగే కొంచెం దంచి పెట్టుకున్న రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు, ఒకరెమ్మ కరివేపాకును కూడా వేసి తాలింపులు కొంచెం వేయించి ఇందులో కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకుని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసేసి జస్ట్ ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకోండి. ఇలా కొంచెం వేయించిన తర్వాత స్టవ్ ఆపే ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని బాగా కలిపేసుకుని పక్కకు దించేసుకోండి. అంతే సూపర్ సింపుల్ గా ఈజీగా చేసుకొని ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది.
