Vankaya Pachadi Recipe : వంకాయలను కాల్చి కొత్తగా ఇలా ట్రై చేయండి వచ్చిన చుట్టాలు వదలకుండా తింటారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vankaya Pachadi Recipe : వంకాయలను కాల్చి కొత్తగా ఇలా ట్రై చేయండి వచ్చిన చుట్టాలు వదలకుండా తింటారు…!

Vankaya Pachadi Recipe : వంకాయ అంటే అందరి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అందరూ వంకాయని అంత ఇష్టంగా తింటారు. ఇంకా గుత్తొంకాయ అంటే ఇక దాని టేస్ట్ వేరు ఉంటుంది అలాంటి గుత్తి వంకాయతో ఇప్పుడు కాల్చి వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వంకాయని ఫ్రై చేసి ఆల్మోస్ట్ చాలామంది పచ్చడి చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా కాల్చి వంకాయతో పచ్చడి చేసి చూడండి భలే టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 October 2022,6:30 am

Vankaya Pachadi Recipe : వంకాయ అంటే అందరి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అందరూ వంకాయని అంత ఇష్టంగా తింటారు. ఇంకా గుత్తొంకాయ అంటే ఇక దాని టేస్ట్ వేరు ఉంటుంది అలాంటి గుత్తి వంకాయతో ఇప్పుడు కాల్చి వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వంకాయని ఫ్రై చేసి ఆల్మోస్ట్ చాలామంది పచ్చడి చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా కాల్చి వంకాయతో పచ్చడి చేసి చూడండి భలే టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు : గుత్తి వంకాయలు, ఆయిల్, టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఎల్లిపాయలు, ఉప్పు కరివేపాకు పోపు దినుసులు, జీలకర్ర, ధనియాలు, చింతపండు మొదలైనవి..దీని తయారీ విధానం : ముందుగా వంకాయలను తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేసి వాటిని మంటపై బాగా కాల్చుకోవాలి.

అలా కాల్చుకున్న తర్వాత అన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి ఇది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పై లేయర్ మొత్తం చేత్తో ఒలిచేసి పక్కన పెట్టేసేయండి. నల్లగా అయిపోతుంది కదా ఈ పైన వంకాయ లేయర్ అంతా ఇదంతా తీసేయాలి పొట్టంతా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా వంకాయ పైన పొట్టంతా తీసేసి వంకాయల్ని పక్కన పెట్టేసుకుందాము ఇలా మొత్తంగా నేను కాల్చుకున్న వంకాయలు అన్నింటిని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈ వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. వంకాయలన్నీ కాల్చి వంకాయ పచ్చడి ఆ టేస్టే వేరేగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ లో ప్రిపేర్ చేసిన తర్వాత పోపు పెట్టుకోమని ఇలా ముందుగానే పోపులాగా పెట్టేసుకొని ఈ పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇంకా కొన్ని పచ్చిమిర్చి ఒక రెండు టమాటోలు వెయ్యాలి. అది మీరు ఎండుమిర్చి తీసుకున్నారంటే టొమాటోలు వేసుకుని అక్కర్లేదు పచ్చిమిర్చి తీసుకున్నారంటే ఒక రెండు టమాటోలు కంపల్సరిగా వేసుకోండి.

Vankaya Pachadi Recipe In Telugu

Vankaya Pachadi Recipe In Telugu

మీరు ఎండుమిర్చితో కావాలంటే ఎండుమిర్చితో చేసుకోవచ్చు లేదా ఇలా పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిర్చి టొమాటో ముక్కలు ఎక్కువగా ఉడికించుకొనక్కర్లేదు కొంచెం సాఫ్ట్ గా అయితే సరిపోతుంది. కాస్త పచ్చిపచ్చిగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం చింతపండు వేసుకొని ఒక నిమిషం పాటు ఇది కూడా కాస్త వేడి అయ్యేంతవరకు మగ్గించుకోండి. ఈ టొమాటోలను తేమతో ఈ చింతపండు కూడా కొంచెం మెత్తబడుతుంది. కాస్త కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర కూడా ఒకసారి బాగా కలిసేంతవరకు కలుపుకొని పక్కన పెట్టేసి వీటన్నింటినీ పూర్తిగా చల్లారేంతవరకు చల్లార్చుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు టమేటా ముక్కలు నేను మరీ ఎక్కువగా ఫ్రై చేయలేదు కాస్త పచ్చిపచ్చిగానే ఉన్నాయి.

ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు అండ్ కొన్ని వెల్లుల్లి రేఖలు వేశాను పచ్చివే వేసుకోవాలి వీటన్నింటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోనండి ఇలా కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ముందుగా మాథ్స్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి మరల ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చేశారంటే చక్కగా వంకాయ కాల్చిన పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలో నెయ్యితో తిన్నారంటే ఈ పచ్చడి వేసుకొని అసలు మర్చిపోలేరు. అంత టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఆవాలు ఆ ధనియాల ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఈ వంకాయ కాల్చిన పచ్చడి రైస్ లోకి కాదండి చపాతీలోకైనా, దోసల్లో కైనా చాలా టేస్టీగా ఉంటుంది. పునుగుల్లో కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి .

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది