Veg Spring Rolls Recipe : ఈ స్టైల్ లో వెజ్ స్ప్రింగ్ రోల్స్ ను ఇలా ట్రై చేసి చూడండి.. కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి…!
Veg Spring Rolls Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ స్ప్రింగ్ రోల్స్. చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లో పిల్లలకి పెట్టవచ్చు. వీటిని ఒక్కసారి తింటే ప్రతిరోజు మళ్లీ మళ్లీ అడుగుతూ ఉంటారు. అంతా బాగుంటాయి. వీటిని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… వీటికి కావలసిన పదార్థాలు : మైదా, ఉప్పు, క్యారెట్, క్యాబేజీ, ఆయిల్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికం, బీన్స్, ఉల్లిపాయలు, గరం మసాలా, సోయాసాస్ మిరియాల పొడి, మొదలైనవి… ముందుగా ఒక కప్పున్నర మైదా పిండిని తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ కొంచెం నీళ్లు వేసి బాగా స్మూత్ గా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి.
15 నిమిషాల తర్వాత పిండిని మరి ఒకసారి కలిపి చిన్న ఉండలుగా చేసి వాటిని పల్చగా ఒత్తుకొని పెనంపై రెండు వైపులా లైట్ గా కాల్చి షీట్ల తయారు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టి దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో కొంచెం పచ్చిమిర్చి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించి తర్వాత దానిలోకి ఒక కప్పు క్యాప్సికం, ఒక కప్పు క్యారెట్ తురుము, ఒక కప్పు బీన్స్, ఒక కప్పు క్యాబేజీ తురుమును వేసి లైట్ గా వేయించుకోవాలి. అలా లైట్ గా వేయించిన తర్వాత దానిలో ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న మిశ్రమంలో కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి దింపి పక్కన ఉంచుకోవాలి.
తర్వాత ముందుగా కాల్చి పెట్టుకున్న షీట్స్ ని తీసుకొని దానిలో స్టఫింగ్ పెట్టి గోధుమపిండి సహాయంతో స్టఫింగ్ పెట్టిన షీట్స్ ని క్లోజ్ చేసుకోవాలి. ఆ విధంగా క్లోజ్ చేసుకున్న అన్ని రోల్స్ ని చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయి అంత ఆయిల్ ని వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ రోల్స్ ని దాన్లో వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు వైపులా బాగా ఎర్రగా అయ్యేవరకు వేయించుకోవాలి. ఈ విధంగా అన్ని వేయించుకొని తీసుకొని వీటిని టమాటా సాస్ తో తీసుకోవచ్చు. లేదా మామూలుగా కూడా తీసుకోవచ్చు. ఇవైతే టీలోకి చాలా బాగుంటాయి. వీటిని పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఈవినింగ్ టైంలో స్నాక్ లా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి.