Anjeer Dry Fruit : ఈ డ్రై ఫ్రూట్ ను ఎప్పుడు తింటే మంచిది… దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anjeer Dry Fruit : ఈ డ్రై ఫ్రూట్ ను ఎప్పుడు తింటే మంచిది… దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి…

 Authored By ramu | The Telugu News | Updated on :1 August 2024,9:00 am

Anjeer Dry Fruit : అంజీర్. దీనిని అత్తి పండ్లు అని కూడా అంటారు. ఈ అంజీర్ పండు డ్రైఫ్రూట్స్ రూపంలో మార్కెట్లో మనకు లభిస్తుంది. అయితే ఈ డ్రై ఫ్రూట్ తినటానికి రుచిగా ఉండటమే కాక దీనిలో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. అయితే ఈ డ్రైఫ్రూట్ లో కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఈ పోషకాలు అన్నీ కూడా ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ పండ్ల ను తీసుకోవటం వలన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అయితే పోషకాల నిధిగా చెప్పే ఈ అంజీర్ ను ఎప్పుడు తింటే మంచిది. ఉదయం మంచిదా. సాయంత్ర తింటే మంచిదా. అనే సందేహం చాలా మందికి ఉన్నది. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

అంజీర్ అనేది తీపి రుచితో శరీరం యొక్క శక్తి స్థాయిలను పెంచుతుంది. అయితే వీటిని ఉదయం పూట తీసుకోవటం వలన దీనిలో ఉన్న సహజ చక్కెర మనకు తొందరగా శక్తి ని ఇస్తుంది.అలాగే జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక ఈ అంజీర్ ను ఉదయం పూట తీసుకోవటం వలన జీర్ణ వ్యవస్థ అనేది ఎంతగానో మెరుగుపడుతుంది.ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది. అయితే రోజంతా అతిగా ఆహారం తీసుకునే అలవాటు ఉన్నవారు ఈ డ్రై ఫ్రూట్ తీసుకోవడం వలన ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే ఈ అంజీర్ లో మెగ్నీషియం అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ డ్రైఫ్రూట్ ను సాయంత్రం తీసుకోవడం వలన కండరాలు అనేవి ఎంతో విశ్రాంతి పొందుతాయి. దీంతో మంచి నిద్ర అనేది పడుతుంది…

గుండె ఆరోగ్యానికి కూడా ఈ అంజీర్ పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. అంతేకాక గుండె సమస్యల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. అయితే ఎముకల ఆరోగ్యానికి దీనిలో ఉన్న క్యాల్షియం మరియు పాస్పరస్ ఎముకల సాంద్రతను కూడా పెంచుతుంది. అయితే అధిక బరువుతో ఇబ్బంది పడేవారు ఈ అంజీర్ ను సాయంత్రం తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉన్నది. ఈ పండ్లలో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. అలాగే జీర్ణ ఆరోగ్యాన్ని ఎంతగానో పెంచుతుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. దీని లో ఉన్న విటమిన్లు మరియు ఖనిజాలు మొత్తం ఆరోగ్యానికి కావలసిన విటమిన్ ఏ ఇ కే, పొటాషియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి.అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలోని ఆక్సికరణ ఒత్తిడిని మరియు వాపును నియంత్రిస్తాయి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది