Alcohol : మ‌ద్యం.. కూర్చొని తాగ‌డ‌మా లేక నిల‌బ‌డి తాగ‌డం బెట‌రా? అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయంటే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Alcohol : మ‌ద్యం.. కూర్చొని తాగ‌డ‌మా లేక నిల‌బ‌డి తాగ‌డం బెట‌రా? అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయంటే

 Authored By prabhas | The Telugu News | Updated on :29 March 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Alcohol : మ‌ద్యం.. కూర్చొని తాగ‌డ‌మా లేక నిల‌బ‌డి తాగ‌డం బెట‌రా? అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయంటే

Alcohol : మద్యం సేవించేటప్పుడు నిలబడటానికి బదులుగా కూర్చోవడానికి ఇష్టపడటానికి ఖచ్చితమైన ఆరోగ్య కారణం లేనప్పటికీ, కూర్చోవడం నెమ్మదిగా తాగడానికి మరియు మెరుగైన నియంత్రణకు దారితీస్తుంది. అయితే నిలబడటం వేగంగా తాగడాన్ని ప్రోత్సహిస్తుంది. కూర్చుని ఉండటం మీరు నెమ్మదిగా తాగడానికి సహాయపడుతుంది. కూర్చున్నప్పుడు, మీరు పానీయాలను తొందరగా తాగడానికి తక్కువ మొగ్గు చూపుతారు, తద్వారా మీరు వాటిని ఆస్వాదించడానికి మరియు చాలా త్వరగా మత్తులో పడే అవకాశాన్ని తగ్గించవచ్చు. కొన్ని సామాజిక సెట్టింగ్‌లలో, తాగేటప్పుడు నిలబడటం మరింత సాధారణం లేదా ఉత్సాహానికి చిహ్నంగా చూడవచ్చు, ఇది కూర్చున్నప్పుడు కంటే త్వరగా తాగడానికి దారితీస్తుంది.

Alcohol మ‌ద్యం కూర్చొని తాగ‌డ‌మా లేక నిల‌బ‌డి తాగ‌డం బెట‌రా అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయంటే

Alcohol : మ‌ద్యం.. కూర్చొని తాగ‌డ‌మా లేక నిల‌బ‌డి తాగ‌డం బెట‌రా? అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయంటే

అయితే నిలబడి మద్యం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి అనారోగ్యాలు సంభవిస్తాయనే దానిపై తాజా అధ్యయనాలు వెల్ల‌డ‌య్యాయి. నిలబడి మద్యం సేవించడం వల్ల శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తేలింది. ఈ అలవాటు జీర్ణ వ్యవస్థ, గుండె, కాలేయం, మెదడుపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిల్చొని మద్యం తాగినప్పుడు శరీరం ఆల్కహాల్‌ను వేగంగా గ్రహిస్తుంది. దీనివల్ల రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది కాలేయంపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. దీర్ఘకాలంలో కాలేయ వ్యాధులు, సిర్రోసిస్ సమస్యలకు దారితీస్తుంది.

సాధారణంగానే మద్యం తాగినప్పుడు లివర్ ఫ్యాటీ లివర్ అయిపోతుంది. శరీరంలో దాదాపు 700 రకాల పనులు సక్రమంగా జరగాలంటే లివర్ ఆరోగ్యంగా ఉండాలి. లివర్ ఫ్యాటీగా అయితే, అది బాగు అయేందుకు స‌మ‌యం ప‌డుతుంది. అంతేకాకుండా వ్య‌య‌ప్ర‌యాస‌లు భ‌రించాల్సి వ‌స్తుంది. అలాగే నిలబడి మద్యం తాగినప్పుడు జీర్ణ వ్యవస్థలో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఆ యాసిడ్ త్రేన్పుల రూపంలో వెంటనే నోటి నుంచి బయటకు రాదు. అది కడుపులోనే ఉంటూ తీవ్ర అసౌక‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఈ పరిస్థితుల్లో గుండెల్లో మంట, ఏసీడీటీ, గ్యాస్ట్రిక్ అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉందని పరిశోధనలు పేర్కొంటున్నాయి. నిలబడి మద్యం తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. నిల‌బ‌డి మ‌ద్యం తాగితే వేగం ఎక్కువై మెదడుకి మత్తు త్వరగా ఎక్కుతుంది.

నిలబడి తాగే వారిలో క్యాన్సర్లు సోకే ప్రమాదం కూడా ఉన్న‌ట్లుగా తేలింది. నోటి, గొంతు, కాలేయం, రొమ్ము క్యాన్సర్ల‌కు మద్యం తాగడానికీ సంబంధం ఉంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. క‌నీసం 13 శాతం క్యాన్స‌ర్లు మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల వస్తున్న‌ట్లు పరిశోధ‌న‌లు వెల్ల‌డించాయి. మొత్తంమీద నిల‌బ‌డి కాకుండా కూర్చొని తాగడం వల్ల నష్టాలు తక్కువగా ఉంటాయని నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది