Beauty Tips : మొహం మీద మొటిమలు వస్తున్నాయా… వీటితో ఇలా ట్రై చేస్తే అద్భుతమైన లాభాలు…!
Beauty Tips : చాలామంది మహిళలు, పురుషులకు మొహం నిండా మొటిమలు వచ్చి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవి సహజ మైన సమస్య అయినప్పటికీ మొహం మీద మొటిమలు అంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. మొటిమలతో బయటికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. అందువలన మొహం పై మొటిమలు రావడం వలన యువత విశ్వాసంపై అధిక ప్రభావం పడుతుంది. ఈ సమస్య ఎక్కువగా యువతలలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ మొటిమలు అవ్వడానికి ఎన్నో కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
ఒక్కో సందర్భంలో శరీరంలో హార్మోన్లు చేంజ్ అవడం వలన కూడా ఇలా మొటిమలు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చాలామంది రకరకాల ప్రోడక్ట్స్ ను, మందులను వాడుతూ ఉంటారు. వీటి వలన తగ్గిపోవడం పక్కన పెడితే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ మొటిమలకు శాశ్వత పరిష్కారం మనం రోజు వంటింట్లో వాడుకునే కొన్ని వస్తువులు మొటిమలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…
ఆపిల్ సైడర్ వెనిగర్… మొటిమలు తొలగించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ఎంతో సహాయపడుతుంది. ఈ వెనిగర్ ఎలాంటి బాక్టీరియా ఫంగస్ నైన తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ వెనిగర్ ను మొటిమలు ఉన్న ప్రదేశంలో నీటినితో కలిపి కాటన్ సహాయంతో దీనిని అప్లై చేయాలి. ఇలా చేయడం వలన అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది.
గ్రీన్ టీ… మొటిమలను నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ గ్రీన్ టీ లో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మొటిమలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాటడం లో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈటీ ను నిత్యం త్రాగడం వలన మూడు నాలుగు వారాలలో మొటిమలు తగ్గిపోతాయి.
అలోవేరా… ఈ కలమంద వినియోగించడం వల్ల చర్మం లో తేమ ఉంటుంది. ఈ కలమంద చర్మాన్ని తాజాగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జల్ చర్మాని మృదువుగా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ కలమందని ముఖానికి రోజు అప్లై చేసుకుంటే మొటిమలు తొందరగా తగ్గిపోతాయి.
దాల్చిన చెక్క… మొటిమలను నివారించడంలో దాల్చిన చెక్క గొప్ప మేలును కలిగిస్తుంది. దాల్చిన చెక్క పొడిలో తేన కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలపై పెడితే మొటిమలు తొందరగా తగ్గిపోతాయి. దీనిలో యాంటీ బ్యాక్ట్ రియల్, యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మొటిమలను నివారించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఫేస్ మాస్క్ గాను, ఔషధంగాను వినియోగించుకోవచ్చు..