Hair Tips : ఎవరూ చెప్పని హెయిర్ గ్రోతింగ్ సీక్రెట్.. ఒక్కసారి రాస్తే కుచ్చులు కచ్చులే!
Hair Tips : జుట్టు నల్లగా ఒత్తగా పెంచుకోవాలని కోరుకోని మహిళలు ఉండరు. ప్రతీ ఒక్క అమ్మాయికి పెద్దగా నల్లగా ఉండే జుట్టు కావాలని కోరుకుంటారు. అమ్మాయిలేనా అబ్బాయిలు కూడా జుట్టు ఒత్తుగా, నల్లగా ఉండాలని తెగ తహతహలాడుతుంటారు. కానీ మన ఆహారపు అలవాట్లు, కాలుష్యం వల్ల మన జుట్టు రాలిపోవడం… తదితర సమస్యలు రావడం చూస్తుంటాం. అయితే ఈ సమస్యలన్నిటికి చెక్ పెడుతూ… జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా మారాలంటే ఈ అద్భుతమైన చిట్కాను పాటించాల్సిందేనని ఆరోగ్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే ఉండే పలు రకాల పదార్థాలతో మంచి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. అయితే అది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా నాలుగు చెంచాల పెసలు, నాలుగు చెంచాల మెంతులు తీసుకోవాలి. వీటిని ఒక రాత్రంతా నీటిలో నాన బెట్టి… బాగా నానిన తర్వాత ఒక గుడ్డలో కట్టి నీటిని వడకట్టాలి. ఇలా వడకట్టిన నీరు ఫ్రీజ్ లో పెట్టి హెయిర్ సీరంలా వాడుకోవచ్చు. వడకట్టిన పెసలు, మెంతులు రెండు రోజులు వదిలేస్తే మొలకలు వస్తాయి. ఇలా మెలకలు వచ్చిన మెంతులు, పెసలు ఒఖ గిన్నెలో వేసుకోవాలి దానిలో ఒక కప్పు కొబ్బరి పాలు, ఒఖ పెద్ద ఉల్లిపాయ, 24 గంటల పాటు నానబెట్టిన బియ్యం నుండి తీసిన బియ్యం నీళ్లు వేసి మెత్తని పేస్టులా మిక్సీ పట్టాలి. దీనిని ఒక గుడడలో వడకట్టడం వలన క్రీమ్ గా ఉండే మెత్తని పేస్టు వస్తుంది. ఇలా వడకట్టకుండా అప్లై చేయడం వల్ల ఇందులో ఉండే కొంచెం బరకడా ఉండే మెంతులు, పెసలు ముక్కుల తలతో ఉండిపోయి ఇబ్బంది కల్గిస్తాయి.
ఈ పేస్టును తలకు కుదుళ్ల నుంచి అప్లై చేయాలి. తనస్నానం చేసిన తర్వాత తలపై అప్లై చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత రెండు గంటలు ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో మైల్డ్ షాంపూ వాడి తల స్నానం చేయాలి. ఇలా తరచుగా చేస్తుంటే పెసలు, మెంతులలో ఉండే ప్రోటీన్ జుట్టు పెరుగుదలకు దృంఢంగా ఉండేందుకు సాయ పడతాయి. జుట్టు సమస్యల పరిష్కారానికి ఈ రెండూ చాలా బాగా పనిచేస్తాయి. ఉల్లిపాయతో తలలో చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీరూ ఓ సారి ట్రై చేయండి.