Health Benefits : ఇంట్లో తమలపాకు చెట్టు పెంచుతున్నారా .. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే ..?
Health Benefits : ప్రస్తుతం చాలా మంది ఇళ్లల్లో తమలపాకు చెట్లను పెంచుతున్నారు. సాధారణంగా మన హిందువులు తమలపాకులను పూజలో వినియోగిస్తారు. అలాగే కిల్లి, పాన్ వంటి వాటిలో ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ఈ తమలపాకు వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఔషధాలలో కూడా వినియోగిస్తారు. అలాగే చాలామంది ఇంట్లో మంచి జరగాలని తమలపాకు తీగను పెంచుతుంటారు. ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో అక్కడ శనీశ్వరుడు ఉండడు అని చెప్తూ ఉంటారు పండితులు. ఈ తమలపాకు తీగ ఇంట్లో ఉంటే కష్టాలన్నీ తీరిపోయి అదృష్టం కలిసి వస్తుందని, భూతప్రేత పిశాచాలు
మన ఇంటి దరిదాపులకు రావాలని అంటుంటారు.ఈ తమలపాకు తీగ సాక్షాత్తు ఆంజనేయ స్వామికి ప్రతిరూపం. తమలపాకు తీగ ఇంట్లో ఉంటే ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్టే అని చాలామంది నమ్ముతుంటారు. తమలపాకు తీగ చిగురు వస్తూ ఉంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉన్నట్టుగా నమ్ముతూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైన సమస్యలు అనేవి తొలగిపోతాయట. తమలపాకు తీగ చక్కగా పందిరి లాగ ఎదుగుతుంటే మన ఇంట్లో కష్టాలు అప్పులు కూడా ఇట్లే తీరిపోతాయని పెద్దలు నమ్ముతూ ఉండేవారు. ఇక తమలపాకు తింటే ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
తమలపాకును తింటే గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే మన తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది. కళ్ళ సమస్యలు ఉంటే ఈ తమలపాకు రసాన్ని తేనె తో కలిపి కళ్ళలో వేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. అలాగే తలలో చుండ్రు సమస్యలు కూడా కూడా తొలగిపోతాయి. అలాగే చక్కెర వ్యాధిగ్రస్తులకు తమలపాకు రసం బాగా ఉపయోగపడుతుందని అధ్యయనంలో తేలింది. అలాగే గుండె సమస్యలు కూడా తగ్గిపోతాయి. తమలపాకు ఆకులను వేడి చేసి దాని నుంచి వచ్చిన ఆముదం చాతి మీద పట్టిస్తే పొడి దగ్గు కూడా తగ్గుతుంది. ఇలా తమలపాకులు వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.