Health Benefits : ఎండు కొబ్బరితో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కాదండోయ్.. రోజూ తినండి!

Authored By pavan J | The Telugu News | Updated on : 1 May 2022, 3:00 pm

Health Benefits : కొబ్బరి కాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఎండు కొబ్బరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా కూరల్లోకి మనం ఎండు కొబ్బరిని విరివిగా వాడుతుంటాం. అయితే మనకు వండుకొని తినడం మాత్రమే తెలుసు కొని దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రం అంతగా తెలియదు. అందుకే ఇపుడు వాటిని తెలుసుకునే ప్రయత్నమే ఈ విషయ సారాంశం. ఎండు కొబ్బరిలో టాన్స్-ఫ్యాట్ అధికంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. అలాగే ఎండిన కొబ్బరిలో ఫైబర్, కాపర్, మాంగనీస్ మరియు సెలీనియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అధిక పోషక విలువలతో కూడిన కొబ్బరి ఏ కాలంలో అయినా అందుబాటులో ఉంటుంది.

అయితే ఎండు కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో గొప్పగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ పురుషులకు 38 గ్రాముల పీచు మరియు మహిళలకు 25 గ్రాముల పీచు పదార్థం అవసరం అవుతుంది. ఎండిన కొబ్బరి ద్వారా ఈ పీచు సమృద్ధిగా అందుతుంది. గుండె సంబంధిత సమస్యలన్నింటినీ క్రమబద్దీకరించగల గుణాలు కబ్బరిలో ఉన్న పైబర్ లో ఉంటాయి. అలాగే ఎండిన కొబ్బరి మొదడు పని తీరును మెరుగు పరచడంలో సహాయ పడుతుంది. మరియు మెదడను చురుగ్గా ఉంచుతుంది. అలాగే మొదడు పని తీరును మెరుగు పరుస్తంది. అంతే కాకుండా అల్జీమర్స్ వంటి భయంకరమైన వ్యాధి యొక్క దశలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

amazing Health Benefits of Dried Coconut nutrition

amazing Health Benefits of Dried Coconut nutrition

అలాగే సెలీనియంతో కూడిన పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ సెలీనియం అనే వ్్యాధులను తగ్గించడంలో ఉపయోగపడుతూనే… సెలెనో ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. పురుషుల్లో వంధ్యత్వాన్ని నివారిస్తుంది. రక్త హీనతను తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే రక్త హీనతను, క్యాన్సర్ కణాలను నివారించడంలోనూ ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థరైటిస్ ను కూడా తగ్గిస్తుంది. అలాగే బోలు ఎముకల వ్యాధి, ఇతర ఎముకలకు సంబంధించిన రోగాలను తగ్గించడంలో ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే అన్నీ కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండే ఎండు కొబ్బరిని ప్రతిరోజూ తిని ఆరోగ్యంగా ఉండండి.

pavan J

No bio available for this author.

  1. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  2. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  3. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

  4. "Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొత్త అడుగు.. రాజకీయాల్లో మరో సంచలనం?"

  5. "Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా ?.. వైరల్ అవుతున్న ధనరాజ్ భార్య వ్యాఖ్యలు.."

  6. "Udhayanidhi Stalin : త్రిష వివాదంలో ఉదయనిధికి లీగల్ షాక్.. కేసు నమోదు, తమిళనాడులో రాజకీయ రగడ.."

  7. "Bengaluru : బెంగళూరులో షాకింగ్ ఘటన .. వ్యక్తిగత ఫోటోల లీక్ .. అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లతో మహిళకు నరకం"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp