Lemongrass : గడ్డి అనుకుని తక్కువగా చూస్తే పొరపాటే.. పెద్ద వ్యాధులకు చెక్ పెట్టే నిమ్మగడ్డి శక్తి..!

Lemongrass : గడ్డి అనుకుని తక్కువగా చూస్తే పొరపాటే.. పెద్ద వ్యాధులకు చెక్ పెట్టే నిమ్మగడ్డి శక్తి..!

 Authored By suma | The Telugu News | Updated on :25 January 2026,8:00 am

ప్రధానాంశాలు:

  •  Lemongrass : గడ్డి అనుకుని తక్కువగా చూస్తే పొరపాటే.. పెద్ద వ్యాధులకు చెక్ పెట్టే నిమ్మగడ్డి శక్తి..!

Lemongrass : ఒకప్పుడు ఇంటి చుట్టూ పెరిగే సాధారణ గడ్డిలా grass కనిపించిన నిమ్మగడ్డి (లెమన్ గ్రాస్) ఇప్పుడు ఆరోగ్య నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. “గడ్డి కదా” అని చిన్న చూపు చూసినవారే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇది కేవలం మొక్క మాత్రమే కాదు.. అనేక రుగ్మతలకు సహజ ఔషధంగా Natural medicine పనిచేసే అద్భుత మూలిక. ఆయుర్వేదం ప్రకారం నిమ్మగడ్డి ఆరోగ్యానికి అందానికి రెండింటికీ మేలు చేస్తుంది.

Amazing health benefits of lemongrass

Lemongrass : గడ్డి అనుకుని తక్కువగా చూస్తే పొరపాటే.. పెద్ద వ్యాధులకు చెక్ పెట్టే నిమ్మగడ్డి శక్తి..!

Lemongrass : నిమ్మగడ్డి అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రత్యేకం?

నిమ్మగడ్డి సువాసనతో కూడిన ఔషధ మొక్క Medicinal plant. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా దీని నుంచి వచ్చే లెమన్ వాసన మనసుకు సేదతీరును ఇస్తుంది. అందుకే దీన్ని వంటకాలలో హర్బల్ టీలు, ఆయుర్వేద ఔషధాలు, సౌందర్య ఉత్పత్తులు, పరిమళాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. చాలామందికి నిమ్మగడ్డి ప్రయోజనాలపై అవగాహన లేకపోయినా ఆయుర్వేద నిపుణులు దీన్ని “సహజ ఆరోగ్య నిధి”గా అభివర్ణిస్తున్నారు.

Lemongrass: నిమ్మగడ్డితో దూరమయ్యే ఆరోగ్య సమస్యలు

నిమ్మగడ్డిని ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి కడుపు మంట, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. జ్వరం, దగ్గు, జలుబు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలకు ఇది మంచి ఉపశమనం ఇస్తుంది. పేగుల్లో ఉండే పురుగులను తగ్గించడంలో కూడా నిమ్మగడ్డి ఉపయోగకరంగా పనిచేస్తుంది. అదనంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇది సహాయకారి. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతూ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. పేలు, చుండ్రు వంటి సమస్యలకు నిమ్మగడ్డి నూనె మంచి పరిష్కారం. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, స్ప్రేన్, నరాల బలహీనతను తగ్గించడంలో కూడా ఇది ఉపకరిస్తుంది. మహిళల్లో నెలసరి నొప్పులను తగ్గించడంలో నిమ్మగడ్డి సహజ ఔషధంగా ఉపయోగపడుతుంది.

Lemongrass: నిమ్మగడ్డిని ఎలా తీసుకోవాలి?

నిమ్మగడ్డిని తీసుకునే సులభమైన మార్గం నిమ్మగడ్డి టీ. ఒక గిన్నెలో నీటిని మరిగించి అందులో నిమ్మగడ్డి పోసలను వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. రుచికి బెల్లం లేదా కొద్దిగా మెంతి ఆకులు కలుపుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆపి, గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టుకుని తాగితే ఆరోగ్యకరమైన హర్బల్ టీ సిద్ధం. ఈ టీ సువాసన ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. రోజుకు ఒక కప్పు తాగితే అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. టీ మాత్రమే కాదు.. నిమ్మగడ్డిని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇకపై నిమ్మగడ్డిని సాధారణ గడ్డి అనుకోకండి. ఇది ఆరోగ్యానికి, జీవనశైలికి మార్పు తీసుకొచ్చే సహజ వరం.

 

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది