Radish Juice : ముల్లంగి జ్యూస్ తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తప్పక తెలుసుకోండి…!
ప్రధానాంశాలు:
Radish Juice : ముల్లంగి జ్యూస్ తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తప్పక తెలుసుకోండి...!
Radish Juice : సాధారణ కూరగాయగా ఉపయోగించే ముల్లంగి దుంప తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ముల్లంగిని చిన్నచిన్న ముక్కలుగా కోసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసిన కొంతసేపటి తరువాత తాగాలి. ఇలా తరచు ముల్లంగి రసాన్ని తీసుకోవడం వలన శరీరానికి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఈ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
![Radish Juice ముల్లంగి జ్యూస్ తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తప్పక తెలుసుకోండి](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Radish-Juice.jpg)
Radish Juice : ముల్లంగి జ్యూస్ తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తప్పక తెలుసుకోండి…!
Radish Juice : జీర్ణక్రియ
ముల్లంగి రసాన్ని తీసుకోవడం వలన కడుపు శుభ్రం అవుతుంది. అదేవిధంగా రక్తంలోని వ్యర్ధాలు తొలగి ఎముకలు దృఢంగా ఉంటాయి. రాత్రి సమయంలో భోజనం తిన్న వెంటనే జీర్ణం అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ క్రియలకు సహాయపడి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే పేగు యొక్క కదలికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Radish Juice పోషకలతో సమృద్ధి
ముల్లంగిలో ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవచ్చు. అంతేకాకుండా ముల్లంగిలో పొటాషియం, విటమిన్ సి ,ఫోలెట్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో ముల్లంగి ఉపయోగపడుతుంది. ముల్లంగిలో ఉండే పొటాషియం రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది. ఫోలేట్ కణాల అభివృద్ధిని మెరుగుపరుస్తుంది.
కొవ్వు కరిగించే గుణం : ఈ జ్యూస్ తాగిన తర్వాత శరీరం కాస్త అలసటగా అనిపిస్తుంది. ఎందుకంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని ఇది కరిగిస్తుంది. కాబట్టి క్రమంగా శరీరాన్ని బలోపేతం చేసుకోండి. అంటే సరైన ఆహారం వ్యాయామం వంటివి చెయ్యాలి. కొవ్వుని కరిగించడంలో ముల్లంగి ముఖ్యమైనది. అంతేకాకుండా బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది అమృతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన బరువు తగ్గవచ్చు. కనుక క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి.
ముల్లంగి రసం ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తుంది. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగా వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఇక ముల్లంగి రసాన్ని ప్రతిరోజు కాకుండా వారానికి ఒకటి లేదా రెండుసార్లు తీసుకోవాలి. అలాగే ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. అంతేకాకుండా ముల్లంగి రసం అందరికీ పడకపోవచ్చు కాబట్టి పడిని వారు వైద్యులను సంప్రదించిన తర్వాత తీసుకోవడం మంచిది.