Hair Tips : మీ జుట్టు ఎంత తెల్లగా ఉన్నా సరే.. మూడు సార్లు ఇది రాశారంటే నిగనిగలాడాల్సిందే!
Hair Tips : ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా ఎదుర్కునే సమస్య చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం. జుట్టు తెల్ల బడటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకపోయినప్పటికీ… మనిషి ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయేలా చేయడంలో ముందుంటుంది. అయితే దీని వల్ల మానసికంగా ఇబ్బంది పడే వాళ్లు ఎంతో మంది. అలాగే తెల్ల జుట్టును ఎవరికీ కనిపించకుండా ఉండేలా చేసేందుకు వారు పడే ఇబ్బందులు మామూలుగా ఉండవు. వేలకు వేల డబ్బు తగలేస్తూ… రకరకాల నూనెలు, షాంపూలు, హెయిర్ కలర్లు, డైలు వాడుతూ ఉంటారు. అయితే వీటన్నిటి వల్ల అప్పటికప్పుడు జుట్టు నల్లబడినా కొంత కాలం తర్వాత మళ్లీ తెల్లబడిపోతుంది. అయితే ప్రతీ సారి జుట్టుకు రంగు వేస్కోవాలంటే చాలా ఇబ్బందే.
అయితే దీనికి చెక్ పెట్టి… నేచురల్ గా తెల్లరంగు జుట్టును నల్లగా మార్చేసుకోవచ్చు. మూడు సార్లు తలకు దీన్ని రాసుకున్నారంటే చాలు.. జుట్టు బలంగా, దృఢంగా అవ్వడమే కాకుండా నిగనిగలాడిపోతుంది. అయితే జుట్టును ఇంత నల్లగా తయారు చేసే ఆ పదార్థం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా కలబంద తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని జామ ఆకులు తీసుకొని.. కలబంద ఉన్న గిన్నెలో వేయాలి. కొన్ని నీళ్లు పోసి.. ఈ మిశ్రమాన్ని పావుగంట సేపు మంచిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత బాగా మరిగిన ఈ నీటిని వడకట్టుకోవాలి. నీరు పూర్తిగా చల్లబడే వరకు అలాగే ఉంచాలి. అయితే ఈ నీటిని తల స్నానం చేసిన తర్వాత రోజు… నూనె పెట్టకుండా జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ మంచిగా రాస్తూ మర్దనా చేసుకోవాలి.
ఈ నీళ్ల తల మొత్తం పట్టేలా రాస్తూ మసాజ్ చేసుకోవాలి. ఒక గంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికి మూడు రోజులు ఇలా చేయడం వల్ల తెల్లగా ఉన్న జుట్టు అంతా నలుపు రంగులోకి మారుతుంది. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకూ ఈ నీటిని వాడొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాదండోయ్… జుట్టు నల్లబడడంతో పాటు దృఢంగా, బలంగా, ఒత్తుగా తయారవుతుంది.ఇందులో వాడే కలబంద కండీషనర్ లా ఉపయోగపడుతుంది. జామ ఆకుల్లో ఉండే క్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జెసిక్ లక్షణాలు జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. కలబంద మాడుపై ఉండే ఇన్ఫెక్షన్లని కూడా తగ్గిస్తుంది. అందుకు ప్రతీ ఒక్కరూ ఈ చిట్కాని పాటించి అందమైన జుట్టును మీ సొంతం చేసుకోండి.