Ginger Tea : అల్లం టీ ఎక్కువసార్లు తాగుతున్నారా.? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే…!!
Ginger Tea : చాలామంది అల్లం టీ ఇష్టంగా ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలాంటి టేస్ట్ గా ఉండడంతో పాటు హెల్త్ కి మంచిదని ఎక్కువసార్లు తాగేస్తూ ఉంటారు. అయితే అల్లం టీ ఎక్కువగా తాగితే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. బాగా జలుబు చేసిన ,దగ్గు ఉన్న అల్లం టీని తాగుతూ ఉంటారు. ఆ సమయంలో మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే వర్షాకాలం, శీతాకాలంలో చాలామంది ఈ అల్లం టీ ని తాగడానికి ఎక్కువ మక్కువ చూస్తూ ఉంటారు. టీ కిఅద్భుతమైన రుచిని ఇచ్చే అల్లం వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు.
అల్లం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలిసి ఉండవచ్చు. కానీ అల్లం టీ ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాల గురించి చాలామందికి తెలియదు.. కాబట్టి ఈ అల్లం వలన ఎటువంటి నష్టం కలుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం… అల్లం లో యాంటీ ప్లేట్లెట్స్ ఉంటాయి. అల్లం లోని ఈ గుణాలు రక్తస్రావాన్ని కలిగిస్తాయి. చాలామంది నల్ల మిరియాలు, లవంగాలు లాంటి మసాలా దినుసులు వేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వలన మరిన్ని సమస్యలు వస్తాయి. అల్లం విధంగా తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఇది మేలు చేస్తుంది.
కానీ అధికంగా తీసుకుంటే మాత్రం జీర్ణ క్రియ కు ఆటంగా కలిగి ఉంటుంది. కావున ఎన్నో రకాల ఉదర సంబంధ సమస్యలు కూడా వస్తాయి. అలాంటి ఎక్కువగా తీసుకోవడం వలన డయేరియా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జీర్ణ కోసం వ్యాధులు వచ్చి ప్రమాదం ఉంటుంది. కావున అల్లం వేసుకునే టీ ఎక్కువగా తాగడం మానుకోవాలి. అల్లం పరిమిత పరిమాణంలో తీసుకుంటే దాని వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ రుచి కోసం అవసరానికి మించి అల్లం తీసుకోవడం వలన గుండెల్లో మంట, కడుపు నొప్పి మొదలైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అల్లం పరిమితంగా వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది.