Fatty Liver : ఫ్యాటీ లివర్ తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ డ్రింక్స్ తాగండి చాలు..!
ప్రధానాంశాలు:
Fatty Liver : ఫ్యాటీ లివర్ తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ డ్రింక్స్ తాగండి చాలు..!
Fatty Liver : ఈ రోజుల్లో బయట ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దాని వల్ల కొంత మందికి లివర్ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. లివర్ అనేది మన బాడీలో ఎంతో కీలకంగా పని చేసే అవయవం. దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. లివర్ మన బాడీలో ట్యాక్సిన్లను క్లీన్ చేయడంలో బాగా పని చేస్తుంది. అయితే చాలా మంది ఈ రోజుల్లో బయట ఫుడ్ తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఫ్యాటీ లివర్ వల్ల కామెర్లు, హెపటైటిస్, కాలేయ వైఫల్యం, కాలేయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు వస్తాయి. కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని డ్రింక్స్ తాగితే బెటర్. అవేంటో తెలుసుకుందాం.
Fatty Liver నిమ్మ రసం- పసుపు కలిసిన నీరు
పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక నిమ్మరసంలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఇది కాలేయాన్ని క్లీన్ చేస్తుంది. కాబట్టి కొన్ని నీటిని వేడి చేసి అందులో నిమ్మరసం, పసుపు వేసుకుని తాగాలి. అంతే కాలేయం మొత్తం క్లీన్ అవుతుంది. అందులో ఉంటే ట్యాక్సిన్లు బయటకు పోతాయి.
Fatty Liver పసుపు – మెంతి నీరు
పసుపులో ఇంతకు ముందు చెప్పుకున్నట్టే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇక పసుపు మెంతులు కలిపి తీసుకుంటే ఇవి బాడీని నిర్వషీకరణ చేయడంలో సాయం చేస్తాయి. అర టీస్పూన్ మెంతి గింజలు, చిటికెడు పసుపును ఒక గ్లాసుడు నీటిలో వేసి మరిగించాలి. తర్వాత చల్లార్చి ఆ నీటిని తాగాలి. ఇలా రెగ్యులర్ గా తాగితే బాడీలో ట్యాక్సిన్లు బయటకు పోతాయి.
Fatty Liver అల్లం టీ
అల్లంటీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అల్లం కాలేయాన్ని క్లీన్ చేయడంలో సాయం చేస్తుంది. అందుకే ప్రతి రోజూ అల్లం టీ తాగే వారిలో ఫ్యాటీ లివర్ సమస్యలు ఎక్కువగా రావని నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు నీటిలో అల్లం వేసి మరిగించాలి. అందులో కాస్తింత నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి తాగాలి.
Fatty Liver వెల్లుల్లి
రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుంటే చాలానే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే వెల్లుల్లిలో ఎంజైమ్ లు బాడీలో ట్యాక్సిన్లను దూరం చేస్తుంటాయి. రోజూ పచ్చి వెల్లుల్లిని తింటే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా దూరం అవుతుంది. దాంతో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
Fatty Liver గోరింటాకు రసం
గోరింటాకుతో చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. ఇది బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది. గోరింటాకు రసం కాలేయంలో ఉంటే ట్యాక్సిన్లను మొత్తం క్లీన్ చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరింటాకు రసం తాగితే ఫ్యాటీ లివర్ సమస్యలు దగ్గరకు కూడా రావని చెబుతున్నారు.