Kidney Stone Problem : మూత్రపిండాలలో రాళ్లు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? అయితే తప్పక వీటిని తీసుకోవాలి… ఎన్నో ప్రయోజనాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kidney Stone Problem : మూత్రపిండాలలో రాళ్లు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? అయితే తప్పక వీటిని తీసుకోవాలి… ఎన్నో ప్రయోజనాలు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :26 January 2023,6:00 am

Kidney Stone Problem : ప్రస్తుతం మనం ఉన్న కాలంలో మనం తీసుకునే ఆహారం మూలంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అయితే అలాంటి సమస్యని మనం నిత్యం తీసుకుని కూరగాయలు ద్వారా మన శరీరానికి శక్తి వస్తూ ఉంటుంది. అంతే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ కూడా కూరగాయలు ఎంతగానో సహాయపడతాయి. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్య కూడా తగ్గిపోతుంది. ఎక్కువగా లభించే మునగకాయలతోనూ మంచి ఉపయోగాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ములక్కాయ ముక్కలు అంటే సాంబార్లో ఎక్కువగా వేస్తూ ఉంటారు. అలాగే టమాటా తో కూడ కూర వండుతూ ఉంటారు. అదేవిధంగా మునగ రుచి వేరుగా ఉంటుంది.

అంతేకాకుండా ఆయుర్వేదంలోనూ మునగ గురించి ప్రత్యేకమైన స్థానం ఉంది. జీర్ణ సంబంధిత ఇబ్బందులు తగ్గిపోతే ఎముకలను దృఢంగా మార్చుతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచడం చాలా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మునగకాయ వలన అసలు ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం… మునగ ఆకుతో చేసిన కూర తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయి. డయాబెటిస్ సమస్యలు ఉన్నవాళ్లకి కూడా ఈ మునగాకులు చాలా సహాయ పడతాయి. దీని ఆకులు యాంటీ డయాబెటిక్ ,యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

Are you suffering from Kidney Stone Problem

Are you suffering from Kidney Stone Problem

ఉదర సంబంధిత ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఈ మునగ ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని తీసుకోవడం వలన మలబద్ధకం లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లు తప్పకుండా ఈ మునగ ఆకులను తీసుకోవాలని చెప్తున్నారు. దీనిలో పోషకలు చాలా ఉన్నాయి. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే తప్పనిసరిగా మునగ ఆకులను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కిడ్నీలో రాళ్లను కరిగించి మూత్రం ద్వారా బయటికి వెళ్లేందుకు ఉపయోగపడుతున్నాయి. మునగ ఆకుల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇది గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారికి ఎంతో సహాయపడుతుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది