Arthritis Pain : ఆర్థరైటిస్ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా…వెంటనే ఉపశమనం పొందాలంటే… ఇలా చేయండి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Arthritis Pain : ఆర్థరైటిస్ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా…వెంటనే ఉపశమనం పొందాలంటే… ఇలా చేయండి…!!

Arthritis Pain : ప్రస్తుత కాలంలో ఎంతో మందిని వేధిస్తున్న సమస్యలలో ఈ ఆర్థరైటిస్ కూడా ఒకటి. అయితే చాలా మందికి కొన్నిసార్లు పాదాలు మరియు వేళ్లు ఉబ్బి ఎంతో తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఇటువంటి సమస్యలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది అర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పి కూడా కావచ్చు. గతంలో వృద్ధులకే కీళ్ల నొప్పులు ఎక్కువగా వచ్చేవి. కానీ ప్రస్తుతం యువత కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంది. సరైన టైంలో ఈ సమస్యకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 August 2024,9:00 am

Arthritis Pain : ప్రస్తుత కాలంలో ఎంతో మందిని వేధిస్తున్న సమస్యలలో ఈ ఆర్థరైటిస్ కూడా ఒకటి. అయితే చాలా మందికి కొన్నిసార్లు పాదాలు మరియు వేళ్లు ఉబ్బి ఎంతో తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఇటువంటి సమస్యలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది అర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పి కూడా కావచ్చు. గతంలో వృద్ధులకే కీళ్ల నొప్పులు ఎక్కువగా వచ్చేవి. కానీ ప్రస్తుతం యువత కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంది. సరైన టైంలో ఈ సమస్యకు చికిత్స చేయించకపోతే ఈ సమస్య మరింత తీవ్రం అవుతుంది. అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, మన శరీరంలో యాసిడ్ స్థాయి అనేది పెరిగినప్పుడు ఆర్థరైటిస్ నొప్పి అనేది వస్తుంది.

కావున శరీర pH స్థాయిని సమతుల్యం చేయడం చాలా అవసరం. దీనికోసం ఆల్కలీన్ ఫుడ్స్ డైట్ లో చేర్చుకోవాలి. అయితే మన శరీరంలో యాసిడ్ స్థాయి అనేది పెరిగినప్పుడు ఆల్కలీన్ స్థాయి అనేది తగ్గటం మొదలవుతుంది. దీంతో. ఆర్థరైటిస్ ప్రమాదం కూడా పెరుగుతుంది. అంతేకాక జీర్ణవ్యవస్థ కూడా ఎంతగానో దెబ్బతింటుంది. అలాగే ఇతర శారీరక సమస్యలు కూడా ఎదురవుతాయి. కావున ఆల్కలీన్ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం చాలా అవసరం… ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారు వారి ఆహారంలో యాపిల్స్, చెర్రీస్,పైనాపిల్, అవకాడోస్, అరటి పండ్లు లాంటివి తీసుకోవటం మంచిది. ఇవి శరీరంలో pH స్థాయిలను రక్షిస్తాయి. అలాగే ఆర్థరైటిస్ నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం పొందడంలో పసుపు అనేది ఎంత బాగా పనిచేస్తుంది అని నిపుణులు అంటున్నారు.

దీనిలో ఉన్న యాంటీ ఇన్ ఫ్లమెంటరీ లక్షణాలు ఆర్థరైటిస్ నొప్పి మరియు వాపును నియంత్రించడంలో మేలు చేస్తుంది. అలాగే పసుపు కలిపిన నీటిని కూడా మీరు తీసుకోవచ్చు… ఆర్థరైటిస్ సమస్యలకు ఈ అల్లం కూడా ఎంతో బాగా పని చేస్తుంది. అయితే ఈ అల్లం లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆర్థరైటిస్ లోని కీళ్ల నొప్పులకు అల్లం టీ తీసుకోవటంతో పాటు అల్లం పేస్ట్ ను కూడా వాపు, నొప్పి ఉన్న ప్రాంతంలో రాసినట్లయితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ అల్లం అనేది కీళ్లను సక్రీయం చేస్తుంది. అయితే ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారు రోజు వ్యాయామం చేయడం కూడా అలవాటు చేసుకోండి. లైట్ జంపింగ్,వాకింగ్, రన్నింగ్ లాంటి వాటిని నెమ్మదిగా చేయాలి. ఇది కండరాలను ఎంతో బలంగా చేస్తాయి. ఈ రకమైన శారీరక శ్రమ వలన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు వీటిని చేసే ముందు కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది