Asthma Patients : వర్షాకాలంలో ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన ఆహారం ఇదే…!
Asthma Patients : వాతావరణం లో వచ్చే మార్పులు, ఆహారంలో మార్పుల కారణంగా ఆస్తమా వస్తుంది. మరి ముఖ్యంగా వర్షాకాలంలో ఆస్తమా రోగులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆస్తమా అనేది సాధారణమైన వ్యాధి. దీనికి చికిత్స లేదు కానీ మెడిసిన్ తో దీనిని కంట్రోల్ చేయవచ్చు. అస్తమా రోగులు ఇతర కాలాలతో పోల్చితే వర్షాకాలంలోనే ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అయితే వర్షాలు పడేటప్పుడు ఆస్తమా రోగులు ఈ ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. అల్లం అస్తమా రోగులకు మెడిసిన్ తో సమానం. ఎందుకంటే ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపితం చేస్తాయి.
అందుకే అస్తమా ఉన్నవారు అల్లం నీటిలో వేసి మరిగించి తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆస్తమా రోగులు పసుపును కచ్చితంగా తీసుకోవాలి. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లు అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వాటితో పోరాడడానికి కూడా సహాయపడతాయి. అలాగే ఆకుకూరలు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బచ్చల కూర, పాలకూరలో విటమిన్లు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అస్తమా రోగుల ఆరోగ్యానికి బచ్చలి కూర చాలా మంచిది. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
అందుకే ఆస్తమా రోగులు ఉసిరికాయలు తినాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే గ్రీన్ టీ శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అందుకే ఆస్తమా రోగులు వర్షాకాలంలో గ్రీన్ టీ ని తప్పకుండా త్రాగాలి. వెల్లుల్లి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక గ్లాసు నీటితో కలిపి రోజుకు ఒకసారి త్రాగాలి లేదా అర కప్పు పాలలో మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించి తాగితే ఆస్తమా రోగులకు చాలా మంచిది. వర్షాకాలంలో వాస్తవ రోగులు ఈ ఆహారాలను తిన్నారంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.